నిక్కీ యాదవ్ హత్య: శ్రద్ధా వాకర్ హత్య జరిగిన తరహాలో దేశ రాజధాని ఢిల్లీలో నిక్కీ యాదవ్ హత్యకు గురైనట్టు తెలుస్తోంది. ఢిల్లీ పోలీసుల ప్రకారం.. ఫిబ్రవరి 9-10 మధ్య రాత్రి నిక్కీ యాదవ్ హత్య చేయబడింది. నిక్కీ బాయ్‌ఫ్రెండ్ సాహిల్ ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టడానికి ఉపయోగించే డేటా కేబుల్‌తో ఆమె గొంతు నులిమి చంపేశాడు.
నిక్కీ యాదవ్ హత్య కేసు: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసు ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తోంది. గతేడాది మేలో జరిగిన ఈ దారుణ మారణకాండ గురించి విన్నవారైనా, తెలిసిన వారైనా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అదే తరహాలో నిక్కీ యాదవ్ హత్యకు గురైనట్టు తెలుస్తోంది. వివరాల్లోకెళ్తే..నైరుతి ఢిల్లీలోని మిత్రాన్ గ్రామానికి చెందిన 24 ఏళ్ల సాహిల్ గెహ్లాట్, ఫిబ్రవరి 9-10 మధ్య రాత్రి తన 23 ఏళ్ల లైవ్-ఇన్ భాగస్వామి నిక్కీ యాదవ్‌ను డేటా కేబుల్‌తో గొంతు కోసి చంపాడు. మృతదేహాన్ని నజఫ్‌గఢ్‌లోని అతని కుటుంబానికి చెందిన దాబాకు తీసుకెళ్లి ఫ్రిజ్‌లో దాచారు. నాలుగు రోజులుగా మృతదేహం ఫ్రిజ్‌లోనే ఉంది. మంగళవారం (ఫిబ్రవరి 14) మృతదేహాన్ని ఫ్రిజ్‌లోంచి బయటకు తీశారు.
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపిన ప్రకారం.. బుధవారం (ఫిబ్రవరి 15) నిందితుడిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. ఇప్పటివరకు పోలీసుల విచారణలో నిందితుడు సాహిల్ గెహ్లాట్ తన ప్రియురాలు నిక్కీతో ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయాన్ని దాచిపెట్టాడని, దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని తెలిసింది. గొడవ తర్వాత.. నిందితుడు సాహిల్ గెహ్లాట్ .. నిక్కీ యాదవ్ ను కశ్మీర్ గేట్ ఐఎస్‌బిటి సమీపంలోకి తీసుకెళ్లి.. తన కారులోని మొబైల్ ఫోన్ డేటా కేబుల్‌తో నిక్కీ యాదవ్ గొంతును బిగించి.. హత్య చేశాడు. మరుసటి ఉదయం అంటే ఫిబ్రవరి 10 న మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.
నిక్కీ యాదవ్ అదృశ్యంపై పొరుగువారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ ప్రారంభమైంది. పోలీసులు తమ విచారణలో సాహిల్ గెహ్లాట్‌ను చేరుకున్నారు. అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. తమదైన శైలిలో విచారించగా.. వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని, నిక్కీ యాదవ్ ను హత్య చేసి.. మృతదేహాన్ని దాబాలోని ఫ్రిజ్ లో పెట్టినట్టు తెలిపాడు. హత్యకు పాల్పడిన నిందితుడి కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.
పోలీసుల కథనం ప్రకారం.. హర్యానాలోని ఝజ్జర్ చెందిన నిక్కీ యాదవ్, ఢిల్లీకి చెందిన సాహిల్ గెహ్లాట్ 2018లో ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలోని కోచింగ్ సెంటర్‌లో కలుసుకున్నారు. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం..ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి జీవించడం మొదలుపెట్టారు. కాలేజీలో కలిసి చదువుకున్నారు. నిక్కీ యాదవ్ హత్య కేసులో.. నిందితులపై ఢిల్లీలోని బాబా హరిదాస్ నగర్ పోలీస్ స్టేషన్‌లో IPC సెక్షన్లు 302 (హత్య), 201 ( సాక్ష్యాధారాలను నాశనం చేయడం లేదా నేరస్థుడిని స్క్రీనింగ్ చేయడానికి తప్పుడు సమాచారం ఇవ్వడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. శ్రద్ధా హత్య కేసు తరహాలోనే కేసు దర్యాప్తు సాగుతుందని పోలీసులు చెబుతున్నారు.
దోషికి మరణశిక్ష విధించాలి: నిక్కీ యాదవ్ తండ్రి డిమాండ్
నిందితుడు సాహిల్ గెహ్లాట్‌కు మరణశిక్ష విధించాలని నిక్కీ యాదవ్ తండ్రి సునీల్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మా కూతురు ఇక లేరు.. ఇప్పుడు మాకు న్యాయం మాత్రమే కావాలి. ఈ అనాగరిక నేరానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష విధించి ఉరి తీయాలి' అని అన్నారు. "ఆమె వేరే వ్యక్తితో లీవింగ్ రిలేషన్ లో ఉందని తమకు తెలియదనీ. ఇదంతా అబద్ధపు ప్రచారమని అన్నారు.
తన కూతురు గత ఎనిమిది నెలలుగా తన చిన్న కూతురుతో కలిసి ఉంటుందని నిక్కీ యాదవ్ తండ్రి సునీల్ యాదవ్ చెప్పారు. తన కుమార్తె, ఒక తెలివైన మహిళ అని, ఆమె ప్రొఫెసర్ కావాలని కలలు కన్నదని అతను చెప్పాడు.నిక్కీ చెల్లెలు కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. నిక్కీ కుటుంబం హర్యానాలోని ఝజ్జర్ జిల్లాకు చెందినది. నిక్కీ తండ్రి గురుగ్రామ్‌లో మోటార్ రిపేర్ వ్యాపారం నిర్వహిస్తున్నారు.
మరోవైపు నిక్కీ యాదవ్ సోదరి మాట్లాడుతూ.. ‘ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు.. అసలు ఏం జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు కాబట్టి మాట్లాడే స్థితిలో లేను. అని కన్నీరు పెట్టుకుంది. దీంతో పాటు నిక్కీ, సాహిల్ మధ్య ప్రేమాయణం గురించి తమకు తెలియదని నిక్కీ కజిన్ జగదీష్ యాదవ్ తెలిపారు.
నిక్కీ యాదవ్ హత్యకు గురైన కారును స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పోలీసుల విచారణలో విరుచుకుపడిన సాహిల్ గెహ్లాట్, చివరికి వారిని మంగళవారం మృతదేహానికి తీసుకెళ్లాడు. అతడిని ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉంచారు.
