Asianet News TeluguAsianet News Telugu

2024 నాటికి అన్ని రాష్ట్రాల్లోకి ఎన్ఐఏ విస్తరిస్తుంది - కేంద్ర హోం మంత్రి అమిత్ షా

2024 సంవత్సరం నాటికి జాతీయ దర్యాప్తు సంస్థ ‘(ఎన్ఐఏ) అన్ని రాష్ట్రాల్లో అడుగుపెడుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని చెప్పారు. 

NIA to expand to all states by 2024 - Union Home Minister Amit Shah
Author
First Published Oct 28, 2022, 12:48 PM IST

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) 2024 నాటికి అన్ని రాష్ట్రాల్లో శాఖలను ప్రారంభిస్తుందని, దీంతో పాటు ప్రాంతేతర హక్కులను కూడా పొందుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అంతర్గత భద్రతపై హోం మంత్రుల రెండు రోజుల చింతన్ శివిర్‌ను అమిత్ షా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తమ మంత్రిత్వ శాఖ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ), ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లను సవరించే ప్రక్రియలో ఉందని చెప్పారు. ముసాయిదాలను త్వరలో పార్లమెంట్‌లో ఉంచనున్నామని పేర్కొన్నారు.

లా అండ్ ఆర్డర్ రాష్ట్రాల బాధ్య‌త‌.. ఇది దేశ ఐక్య‌త‌తో ముడిపడి ఉంది: ప్ర‌ధాని మోడీ

ఎన్ఐఏ అధికారాల విస్తరణలో ఉగ్రవాది ఆస్తులను జప్తు చేసే అధికారాలను కూడా ఇవ్వడం ఇమిడి ఉందని అమిత్ షా చెప్పారు. “ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో నిర్ణయాత్మక విజయం సాధించడానికి, చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ బలోపేతం చేయబడుతోంది. దీని కింద ఎన్ఐఏ, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)ను సవరించడం ద్వారా వ్యక్తిగత ఉగ్రవాదులుగా ప్రకటించడానికి నిబంధనలు తయారయ్యాయి. ఎన్ఐఏకు అదనపు ప్రాదేశిక అధికార పరిధితో పాటు ఉగ్రవాదులు సంపాదించిన ఆస్తిని జప్తు చేసే అధికారం కూడా ఇవ్వబడింది. 2024 నాటికి అన్ని రాష్ట్రాల్లో ఏజెన్సీ శాఖలను ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించుకున్నాము” అని అమిత్ షా తెలిపారు.

ఏపీపీఎస్సీ నిర్వహించిన అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల‌ ప్రశ్నాపత్రం లీక్.. సీబీఐ కేసు న‌మోదు

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని అమిత్ షా నొక్కి చెప్పారు. కేంద్రం,  రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం కారణంగా దేశంలోని చాలా భద్రతా హాట్‌స్పాట్‌లు ఇప్పటికే దేశ వ్యతిరేక కార్యకలాపాల నుండి విముక్తి పొందాయని అన్నారు. కొత్త వేధిక ఉమ్మడి వ్యూహాన్ని, భవిష్యత్ రోడ్‌మ్యాప్‌ను అభివృద్ధి చేయడంలో మరింత సహాయపడుతుందని అన్నారు.

“లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అయితే టెక్నాలజీ నేరాలను హద్దులు లేకుండా చేసింది. సైబర్ నేరాలు, ఉగ్రవాదం, డ్రగ్స్ స్మగ్లింగ్, ఆర్థిక నేరాలు మొదలైన సరిహద్దులు లేని నేరాలన్నింటినీ ఎదుర్కోవడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రం కలిసి చర్చించి వ్యూహాన్ని రూపొందించడం చాలా ముఖ్యం ” అని అమిత్ షా తెలిపారు.

సింహం తలను నిమిరుతున్న మహిళ... వీడియో వైరల్..!

ప్రస్తుతం ఎన్ఐఏ ఢిల్లీ, హైదరాబాద్, గౌహతి, కొచ్చి, లక్నో, ముంబై, కోల్‌కతా, రాయ్‌పూర్, జమ్ము, చండీగఢ్, రాంచీ, చెన్నై, ఇంఫాల్, బెంగళూరు, పాట్నాలలో 15 శాఖలను కలిగి ఉంది. 26/11 ముంబై దాడుల తర్వాత ఏర్పడిన ఫెడరల్ యాంటీ టెర్రర్ ఏజెన్సీ, ఇప్పటివరకు 468 కేసులను నమోదు చేసింది. 2008లో ఏర్పాటైన ఎన్ఐఏ.. ప్రస్తుతం అనేక మెట్రోపాలిటన్ నగరాల్లో నాలుగు కేంద్రాలను కలిగి ఉంది. అయితే ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో ఎన్ఐఏ శాఖలను విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ చర్యను బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios