Asianet News TeluguAsianet News Telugu

పది రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ..

ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్న వారికి వ్యతిరేకంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు మరో ఎనిమిది రాష్ట్రాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. 

NIA searches in ten states: In AP and Telangana states..
Author
First Published Sep 22, 2022, 9:05 AM IST

రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశంలోని అనేక చోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంయుక్తంగా సోదాలు నిర్వ‌హిస్తున్నాయి. తెలంగాణ‌లోని హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ప‌లు ప్రాంతాల్లో, అలాగే ఏపీలోని క‌ర్నూల్, గుంటూరు జిల్లాల్లోనూ ఈ త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి. 

ఇదే స‌మ‌యంలో ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కూడా ఈడీ, ఎన్ఐఏ దాడులు చేప‌ట్టాయి. ఈ దాడుల్లో దాదాపు 100 మందికి పైగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి చెందిన స‌భ్యుల‌ను, వారితో సంబంధం ఉన్న వ్య‌క్తుల‌ను అరెస్టు చేశారు. వారిపై సంబంధిత సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. దాదాపు 10 రాష్ట్రాల్లో ఈ సోదాలు, అరెస్టులు జ‌రిగాయి. 

ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, శిక్షణా శిబిరాలను నిర్వహించడం, నిషేధిత సంస్థల్లో చేరడానికి ప్రజలను రాడికలైజ్ చేయడంలో నిమగ్నమైన వ్యక్తుల నివాస, అధికారిక ఆవరణల్లో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. 200 మందికి పైగా ఎన్ఐఏ, ఈడీ స‌భ్యుల బృందం ఇందులో పాల్గొన్నారు. 

కేర‌ళ‌లోని మలప్పురం జిల్లా మంజేరిలో పీఎఫ్ఐ చైర్మన్ ఓఎంఏ సలాం ఇంటితో పాటు పీఎఫ్ఐ కార్యాలయాలపై అర్ధరాత్రి నుంచి ఎన్ఐఏ, ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులు జరుగుతుండగా, మలప్పురంలోని ఓఎంఏ సలామ్ ఇంటి ముందు పీఎఫ్ఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ‘‘ కేరళలోని పీఎఫ్ఐకి చెందిన వివిధ కార్యాలయాలపై ఎన్‌ఐఏ, ఈడీ దాడులు నిర్వహించాయి. 50 ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. ఇళ్ల‌పై కూడా దాడులు కొన‌సాగుతున్నాయి.’’ అని పీఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ అబ్దుల్ సత్తార్ తెలిపారు.

మద్యం మత్తులో క్లాస్ రూం కు వచ్చిన ప్రొఫెసర్.. అంతటితో ఆగకుండా పాటలు పాడుతూ.. మాస్ స్టెప్పులు ​.. వీడియో వైరల్​

‘‘ రాష్ట్రంలోని ప్రముఖ ఫ్రంట్ నాయకుల ఇళ్లలో కేంద్ర ఏజెన్సీలు ఎన్ఐఏ, ఈడీ అర్ధరాత్రి దాడులు జరపడమే ఈ దారుణాలకు తాజా ఉదాహరణ. జాతీయ, రాష్ట్ర, స్థానిక స్థాయి నాయకుల ఇళ్లలో ఈ దాడులు జరుగుతున్నాయి. రాష్ట్ర కమిటీ కార్యాలయంపై కూడా దాడులు జరుగుతున్నాయి. అసమ్మతి స్వరాలను అణచివేయడానికి ఏజెన్సీలను ఉపయోగించడానికి ఫాసిస్టు ప్రభుత్వం తీసుకున్న చర్యలను తీవ్రంగా నిరసిస్తున్నారు ’’ అని ఆయన తెలిపారు.

మదురై, తేని, దిండిగల్, రామనాథపురం, కడలూరు, తిరునల్వేలి, తెన్కాశిలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు దాడులు ప్రారంభించారు. పీఎఫ్ఐ జిల్లా అధిపతి ప్యాజ్ అహ్మద్, మదురై జిల్లా కార్యదర్శి యాసిర్ అరాఫత్లను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా.. గత కొన్ని రోజులుగా పీఎఫ్ఐ లింకులకు సంబంధించి డజనుకు పైగా కేసులను ఎన్ఐఏ నమోదు చేసింది. దేశంలో పీఎఫ్ఐ లింకులకు సంబంధించి ఇటీవలి కాలంలో 100కు పైగా చోట్ల దాడులు చేసినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి.

సెప్టెంబర్ 1వ తేదీన ఏపీలోని వివిధ జిల్లాలోని అనేక ప్ర‌దేశాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. హింసను ప్రేరేపించడం, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి పీఎప్ఐ సభ్యులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని ఓ వ్య‌క్తికి చెందిన ఇంటిపై దాడి చేసి, హైద‌రాబాద్ లోని ఎన్ఐఏ ఆఫీసుకు విచార‌ణ కోసం రావాల‌ని ఆయ‌న‌కు నోటీసు జారీ చేసింది. ఆ స‌మ‌యంలో నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఎన్ఐఏ అధికారుల 23 బృందాలు సోదాలు చేప‌ట్టాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios