కోయంబత్తూరు కారు పేలుడు కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)  దర్యాప్తు ముమ్మరం చేసింది. తమిళనాడు వ్యాప్తంగా 45 చోట్ల సోదాలు చేపట్టింది.

కోయంబత్తూరు కారు పేలుడు కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. తమిళనాడు వ్యాప్తంగా 45 చోట్ల సోదాలు చేపట్టింది. గురువారం తెల్లవారుజాము నుంచి ఎన్‌ఐఏ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానితులు, మద్దతుదారుల ప్రాంగణాల్లో ఎన్ఐఏ సోదాలు జరుపుతోంది. ఒక్క కోయంబత్తూరులోని కొత్తమేడు, ఉక్కడం, పొన్విజా నగర్‌తో పాటు పలుచోట్ల ఎన్‌ఐఏ అధికారులు సోదాలు జరుపుతున్నారు. చెన్నైలోని పుదుపేట్, మన్నాడి, జమాలియా, పెరంబూర్‌లో దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. 

ఇక, గత నెల 23న కోయంబత్తూర్‌లోని కొట్టై ఈశ్వరన్ దేవాలయం సమీపంలో కారులో పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ అనుమానస్పద స్థితిలో ముబిన్ అనే 25 ఏళ్ల వ్యక్తి మృతదేహం లభించింది. కోయంబత్తూరు కారు పేలుళ్ల కేసుకు సంబంధించి తమిళనాడు పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం ప్రయోగించారు. అయితే వారంతా అనుమానాస్పద స్థితిలో మరణించిన జమీషా ముబిన్ సహచరులని పోలీసులు తెలిపారు. 

రోవైపు ఉక్కడంలోని ముబిన్ ఇంట్లో పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించే పదార్థాలను పోలీసులు గుర్తించారు. పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగపడే 75 కిలోల పొటాషియం నైట్రేట్, బొగ్గు, అల్యూమినియం పౌడర్, సల్ఫర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ముబిన్‌ను గతంలో ఉగ్రవాద సంబంధాలపై 2019లో ఎన్‌ఐఏ ప్రశ్నించింది. మ

అయితే కారు పేలుడు ఘటన నిందితులకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు దర్యాప్తులో తేలడంతో తమిళనాడు పోలీసులు.. ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించారు. దీంతో ఈ కేసుకు విచారించేందుకు ఎన్‌ఐఏ రంగంలోకి దిగింది. అక్టోబర్ 27న ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఎన్ఐఏ దర్యాప్తు మొదలుపెట్టింది.