Asianet News TeluguAsianet News Telugu

మ‌రోసారి 8 ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు.. 50 మందికిపైగా పీఎఫ్ఐ స‌భ్యుల అరెస్టు

ఎన్ఐఏ మరో సారి పీఎఫ్‌ఐ ఆఫీసులపై దాడులు కొనసాగిస్తోంది. మొత్తంగా దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఈ దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 50 మందికి పైగా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. 

NIA raids in 8 states again.. More than 50 PFI members arrested
Author
First Published Sep 27, 2022, 1:22 PM IST

దేశంలోని 8 రాష్ట్రాల్లోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) సంస్థలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) రెండో విడత దాడులు నిర్వహిస్తోంది. దాదాపు 50 మంది సభ్యులను ఏజెన్సీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, కేరళ, గుజరాత్, కర్ణాటక, అస్సాంలలోని పీఎఫ్‌ఐ ప్రాంగణాలపై దర్యాప్తు సంస్థ దాడులు చేస్తోంది.

బ‌డా వ్యాపారుల‌కు రుణాలు మాఫీ.. చిరు వ్యాపారులు, రైతులు జైల్లోకా? : స‌ర్కారుపై రాహుల్ గాంధీ ఫైర్

ఉగ్రవాద నిధులపై ఉచ్చును కఠినతరం చేసేందుకు ఎన్ఐఏ మరోసారి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)లోని పలు ప్రాంతాల్లో దాడులు చేస్తున్నాయి. ప్ర‌స్తుతం వ‌ర‌కు ఉన్న నివేదిక‌ల ప్ర‌కారం.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, షోలాపూర్‌లో ఆదివారం రాత్రిపూట దాడులు జరిగాయి. ఆ ప్రాంతంలో ఒక‌రిని అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తీసుకెళ్లారు. మొత్తంగా మహారాష్ట్ర పోలీసులు ఔరంగాబాద్‌లో 13 మందిని అరెస్టు చేశారు.

కమ్రూప్ దరాంగ్ జిల్లాలకు చెందిన మరో 18 మంది పీఎఫ్ఐ క్రియాశీల కార్యకర్తలను అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్, మీరట్ వంటి ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులు, దాని ఏటీఎస్ విభాగాల సహాయంతో ఎన్ఐఏ దాడులు నిర్వ‌హిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమైన దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్, రోహిణి, జామియా, షాహిన్‌బాగ్‌లలో దాడులు నిర్వ‌హిస్తున్నారు.

సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి లైవ్ స్ట్రీమ్.. లైవ్ టెలికాస్ట్‌లో వాదనలు.. ఇక్కడ చూసేయండి..!

కాగా.. ఈ రాష్ట్రంలో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. ‘‘ మేము పీఎఫ్ఐ సభ్యులను గ్రిల్ చేస్తున్నాము. ఇప్పటి వరకు వారిలో ఎవరిపైనా అరెస్ట్ మెమోలు దాఖలు చేయలేదు. సెప్టెంబర్ 22వ తేదీన దేశ వ్యాప్తంగా దాడులు చేసి అరెస్టు చేసిన వారిని విచారించాం. వారి నుంచి అందిన సమాచారం మేరకే తాజా దాడులు నిర్వహించాం ’’ అని వర్గాలు పేర్కొన్నాయి. 

టీచ‌ర్ కొట్ట‌డంతో ద‌ళిత విద్యార్థి మృతి.. పోలీసుల కారుకు నిప్పుపెట్టి, రాళ్లు రువ్విన బంధువులు

ఇదిలా ఉండ‌గా.. సెప్టెంబర్ 22వ తేదీన 105 మందికి పైగా పీఎఫ్ఐ స‌భ్యుల‌ను, ఎన్ఐఏ, ఈడీ అరెస్టు చేయగా, మరో 200 మందిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం కూడా ఇద్దరు సభ్యులపై లుక్ అవుట్ సర్క్యులర్లు జారీ చేశారు.  ప్రస్తుతానికి ఎన్ఐఏ మొత్తం 19 పీఎఫ్ఐ సంబంధింత కేసుల‌ను ద‌ర్యాప్తు చేస్తోంది. గతంలో అరెస్టయిన 46 మంది నిందితులు 2010-11 కేసుల్లో దోషులుగా తేలినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. దాదాపు 355 మంది పీఎఫ్ఐ సభ్యులపై ఇప్పటికే ఏజెన్సీ ఛార్జిషీట్‌ చేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios