మన్సూఖ్ హీరెన్ హత్య కేసులో నిందితుడిగా వున్న పోలీస్ అధికారి సచిన్ వాజేను జ్యూడిషీయల్ కస్టడీకి అనుమతించింది కోర్ట్. ఈ నెల 23 వరకు కస్టడీలో వుండనున్నారు. ఎన్ఐఏ కస్టడీ గడువు ముగియడంతో వాజేను కోర్టు ఎదుట హాజరుపరిచారు.

దీంతో ఆయనను జ్యూడిషీయల్ కస్టడీకి అప్పగించింది న్యాయస్థానం. అంతేకాకుండా సచిన్ వాజేను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి సైతం ఇచ్చింది. మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ బలవంతపు వసూళ్ల కేసులో సచిన్ వాజే కీలకంగా వున్నారు.

వాజే కూడా ఎన్ఐఏకు లేఖ రాశారు. ఇప్పటికే విచారణ ప్రారంభించని సీబీఐ.. సచిన్ వాజేను ప్రాథమికంగా విచారించింది. ఇవాళ స్టేట్‌మెంట్ కూడా రికార్డు చేసింది. మళ్లీ అవసరమైతే విచారించేందుకు సీబీఐకి అనుమతించింది ప్రత్యేక కోర్ట్. అయితే సచిన్ వాజేకు జైలులో భద్రత కల్పించాలని కోర్ట్‌ను ఆయన తరపు న్యాయవాది. 

Also Read:ఆ మంత్రులు తోడు దొంగలు: సచిన్ వాజే సంచలన ఆరోపణలు.. వివాదంలో మరో ‘‘అనిల్’’

కాగా, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు వున్న వాహనం కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఉద్ధవ్ థాక్రే కేబినెట్‌లోని అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు వున్న వాహనం కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఉద్ధవ్ థాక్రే కేబినెట్‌లోని అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా మరో మంత్రిపై పోలీస్ అధికారి సచిన్ వాజే సంచలన ఆరోపణలు చేశారు. వసూళ్ల దందాలో మంత్రి అనిల్ పరబ్ హస్తం వుందని చెప్పారు. మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్, మంత్రి అనిల్ పరబ్ కలిసి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఎన్ఐఏకు సచిన్ వాజే లేఖ రాశారు.