Asianet News TeluguAsianet News Telugu

ఆ మంత్రులు తోడు దొంగలు: సచిన్ వాజే సంచలన ఆరోపణలు.. వివాదంలో మరో ‘‘అనిల్’’

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు వున్న వాహనం కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఉద్ధవ్ థాక్రే కేబినెట్‌లోని అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Anil Deshmukh, Anil Parab asked me to extort over Rs 100 crore says Sachin Vaze ksp
Author
Mumbai, First Published Apr 7, 2021, 7:17 PM IST

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు వున్న వాహనం కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఉద్ధవ్ థాక్రే కేబినెట్‌లోని అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా మరో మంత్రిపై పోలీస్ అధికారి సచిన్ వాజే సంచలన ఆరోపణలు చేశారు. వసూళ్ల దందాలో మంత్రి అనిల్ పరబ్ హస్తం వుందని చెప్పారు. మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్, మంత్రి అనిల్ పరబ్ కలిసి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఎన్ఐఏకు సచిన్ వాజే లేఖ రాశారు. 

Also Read:సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశం: మహా హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా

ఎన్ఐఏ కస్టడీలో వున్న సచిన్ వాజే విచారణలో కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తనను రెండు కోట్లు డిమాండ్ చేసినట్లు సచిన్ వాజే చెప్పినట్లు తెలిసింది.

బార్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేయమని చెప్పినట్లు సచిన్ వాజే ఆరోపించారు. డబ్బులు వసూలు చేయడమే నీ ఉద్యోగమని అనిల్ దేశ్‌ముఖ్ అన్నట్లు ఆయన చెప్పారు.

ఇప్పటికే మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఈ కేసు.. సచిన్ వాజే చేసిన తాజా ఆరోపణలతో మరింత కాకరేపుతోంది. అవినీతి ఆరోపణలతో ఇప్పటికే అనిల్ రాజీనామా చేసిన  సంగతి తెలిసిందే

Follow Us:
Download App:
  • android
  • ios