బుద్ధగయలో పేలుళ్లకు కుట్ర.. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు...ఐసిస్‌ సానుభూతిపరుల అరెస్ట్

First Published 7, Aug 2018, 3:48 PM IST
NIA arrests 3 Bangladeshi terrorists accross india
Highlights

బుద్ధగయ, ఉత్తరాఖండ్, అర్థకుంభమేళాల్లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన ఐసిస్ సానుభూతిపరులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. ఈ నెల 3న కేరళలో జరిపిన దాడుల్లో బుద్దగయలో ఐఈడీలు అమర్చారన్న ఆరోపణలపై ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది

బుద్ధగయ, ఉత్తరాఖండ్, అర్థకుంభమేళాల్లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన ఐసిస్ సానుభూతిపరులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. ఈ నెల 3న కేరళలో జరిపిన దాడుల్లో బుద్దగయలో ఐఈడీలు అమర్చారన్న ఆరోపణలపై ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.. వారిచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా రెండు రోజుల నుంచి ఎన్ఐఏ సోదాలు, తనిఖీలు నిర్వహిస్తోంది.

దీనిలో భాగంగా బెంగళూరులో ‘‘జామాతే ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్‌’’ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న మహ్మద్ జాహిద్దుల్ ఇస్లామ్, ముస్తాఫిజుర్‌‌లను అదుపులోకి తీసుకుంది. ఇస్లామ్ ఆదేశాల మేరకు ముస్తాఫిజుర్ పేలుడు సామాగ్రిని సమకూర్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

అలాగే హైదరాబాద్ పాతబస్తీలోని షాహీన్‌నగర్, పహాడీషరీఫ్‌లలోనూ కొందరు సానుభూతిపరులు ఉన్నట్లు సమాచారం ఉండటంతో తనిఖీలు నిర్వహించి.. అనుమానితులను ప్రశ్నిస్తోంది. షాహీన్‌నగర్‌కు చెందిన అబ్థుల్ ఖుద్దుస్, అబ్ధుల్ ఖదీర్‌ అనే యువకులను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు.
 

loader