వరుడు దేశ ప్రధాని పేరు చెప్పలేకపోయాడని అప్పుడే అయిన పెళ్లిని క్యాన్సిల్ చేసిందో వధువు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది.  

ఉత్తరప్రదేశ్ : పెళ్లిళ్లు క్యాన్సిల్ చేసుకోవడానికి ఇటీవలి కాలంలో విచిత్రమైన కారణాలు వెతుక్కుంటున్నారు. వరుడికి పదిరూపాయల నోట్లు లెక్క పెట్టరాలేదని, నల్లగా ఉన్నాడని..ఏవేవో వింతైన కారణాలు. అలాంటి ఓ వింతకారణంతో వధువు పెళ్లి క్యాన్సిల్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో తాజాగా వెలుగు చూసింది. అయితే, ఈసారి అయిన పెళ్లిన గంటల వ్యవధిలో క్యాన్సిల్ చేసుకుని.. వరుడి తమ్ముడినే పెళ్లి చేసుకుందా వధువు.

దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెడితే.. ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లాలో దేశప్రధాని పేరు చెప్పలేదనే కారణంతో ఓ వధువు అయిన పెళ్లిని క్యాన్సిల్ చేసింది. పెళ్లికొడుకు తమ్ముడినే మళ్లీ పెళ్లి చేసుకుంది. రంజన అనే యువతికి శివశంకర్ (27)అనే వ్యక్తితో జూన్ 11న ఘనంగా వివాహం జరిగింది. ఆరునెలల క్రితమే పెద్దలు వీరిద్దరి వివాహాన్ని నిర్ణయించారు. ఆ మేరకు వివాహం జరిగింది. 

బాలాసోర్ స్టేషన్ సిగ్నల్ ఇంజనీర్ అదృశ్యం! ఇంటిని సీజ్ చేసిన సీబీఐ !!

వివాహానంతరం జూన్ 12వ తేదీన వధువు ఇంట్లో ఓ చిన్న కార్యక్రమం జరుగుతోంది. కొత్త పెళ్లి కొడుకు.. అత్తవారింట్లో మొదటి రోజు.. మరదలు,బావమరిది... చుట్టాలు.. ఇళ్లంతా హడావుడిగా ఉంది. ఆ సమయంలో శివశంకర్ తన మరదలు,బావమరిదితో సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఈ సమయంలో వధువు సోదరి బావను మన ప్రధాని ఎవరు అని ప్రశ్నించింది.

దీనికి శివశంకర్ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలాడు. ఇదంతా చుట్టూ ఉన్న బంధువులు సరదాగా చూస్తున్నారు. వారు కూడా అతను సమాధానం చెప్పలేకపోవడంతో షాక్ అయ్యారు. అతడిని ఇది కూడా తెలియదా అంటూ ఆటపట్టిస్తూ హేళన చేశారు. గుసగుసలాడుకున్నారు. ఇది పెళ్లికూతురికి నచ్చలేదు. తీవ్ర అవమానంగా భావించింది. అంతే ఈ వరుడు తనకు వద్దని తేల్చేసింది. అతనితో జరిగిన పెళ్లిని క్యాన్సిల్ చేసింది. శివశంకర్ తమ్ముడైన అనంత్ ను అదే సమయంలో.. అక్కడికక్కడే మరో పెళ్ళి చేస్తుంది. కాగా.. అనంత్ రంజన కంటే వయసులో చిన్నవాడు కూడా. ఊహించని ఈ ఘటనకు అందరూ షాక్ అయ్యారు.