Asianet News TeluguAsianet News Telugu

భార్య వేధింపులు...పెళ్లైన మూడునెలలకే కొత్తపెళ్లికొడుకు ఆత్మహత్య..

కర్ణాటకలో దారుణ ఘటన వెలుగు చూసింది. కొత్తగా పెళ్లైన ఓ యువకుడు మూడు నెలలు కూడా గడవకముందే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Newly wed man commits suicide due to wife abuse in karnataka
Author
First Published Dec 15, 2022, 1:18 PM IST

బెంగళూరు : కర్ణాటకలోని బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో నవవరుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. బెంగళూరు ఉళ్లాల ఎంవీ లేఔట్ లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతానికి చెందిన మహేశ్వర(25)కు మూడు నెలల క్రితం వివాహం అయ్యింది. భార్య పేరు కవన. అయితే హఠాత్తుగా ఐదు రోజుల క్రితం మహేశ్వర ఉరేసుకున్నాడు.

తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని మరణించాడు. సమాచారం అందండంతో జ్ఞానభారతి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, వీరి విచారణలో కొత్తగా పెళ్లైన జంట చిలకా గోరింకల్లా ఉండాల్సింది పోయి.. నిత్యం గొడవలు పడేవారని తేలిసింది. కవన తరచుగా భర్తతో గొడవ పడుతుండేదని.. వేధింపులకు గురి చేసేదని తేలింది. ఈ వేధింపులు తట్టుకోలేక కొత్తగా పెళ్లైనా ఆ సంతోషం అతని ముఖంలో ఎప్పుడూ కనిపించకపోదని తెలిసినవారు అంటున్నారు. ఈ వేదనతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఉగ్రవాదాన్ని సమర్థించే దేశానికి నీతులు చెప్పే అర్హత లేదు.. పాక్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన భారత్ !

ఇదిలా ఉండగా, నవంబర్ 7న మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ధార్ లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో అతడి భార్య పైనే పోలీసులు నేరం మోసి అరెస్ట్ చేశారు. ఆమె గత కొన్ని రోజులుగా భర్తను వేధిస్తోంది. దీంతో అతను తీవ్ర మనస్తాపం చెందాడు. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లిదండ్రుల ఈ మేరకు పోలీసులకు  ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో తల్లిదండ్రుల ఆరోపణలు నిజమేనని తేలింది. 

దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ధార్లోని ఘటా బిలోద్ కు చెందిన దిలీప్ (40) అక్టోబర్ 10వ తేదీన నిద్రమాత్రలు మింగి తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, దిలీప్ మృతికి అతని భార్య రింకూనే కారణమని.. అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రింకూను విచారణకు పిలిపించారు. విచారణలో ఆమె నిజాలు వెల్లడించింది. భూమి విషయంలో తనకు భర్తతో వివాదం చెలరేగిందని, వారసత్వంగా వచ్చిన భూమిని అమ్మి  డబ్బులు తీసుకురావాల్సిందిగా తను కోరానని, అందుకు భర్త అంగీకరించలేదని తెలిపింది.

భూమి విషయమై కోడులు తన కొడుకు రింకూతో నిత్యం గొడవ పడేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు,  ఆత్మహత్య చేసుకుని చచ్చిపో అంటూ తిట్టేదని కూడా చెప్పారు. ఈ విషయం కొడుకు తమతో చెప్పుకుని బాధపడ్డాడని దిలీప్ తండ్రి పోలీసులకు చెప్పాడు. చనిపోవడానికి రెండు రోజుల ముందు ఈ విషయం తమకు చెప్పాడన్నారు. తాము ఓదార్చామని అంతలోనే ఇంత దారుణానికి తెగించాడని తెలిపారు. భార్య వేధింపుల వల్లే దిలీప్ చనిపోయాడని తేలడంతో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల వాంగ్మూలాలను తీసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios