హనీమూన్‌కు వెళ్లుతుండగా నవ వధువు మిస్సింగ్.. అర్ధంతరంగా నవ వరుడు రివర్స్.. ఏం జరిగిందంటే?
బిహార్‌కు చెందిన నవ దంపతులు హనీమూన్ కోసం డార్జిలింగ్‌కు సూపర్ ఫాస్ట్ ట్రైన్‌లో బయల్దేరారు. కానీ, మార్గంమధ్యలోనే భార్య కనిపించకుండా పోయింది. దీంతో భర్త వెనక్కి తిరిగి వచ్చాడు. అసలేం జరిగిందంటే?
న్యూఢిల్లీ: వారిద్దరూ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. హనీమూన్ కోసం ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. బిహార్‌కు చెందిన ఆ నవ దంపతులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన డార్జిలింగ్‌కు వెళ్లాలని అనుకున్నారు. ట్రైన్‌లో వారు ప్రయాణం ప్రారంభించారు. కానీ, దారి మధ్యలోనే వారి హనీమూన్ ట్రిప్ అర్ధంతరంగా ముగిసిపోయింది. వారు ప్రయాణిస్తున్న ట్రైన్‌లోనే నవ వధువు కనిపించకుండా పోయింది. నవ వరుడు వెనుదిరిగి వచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన ఆ వ్యక్తి ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగి. ఆరు నెలల క్రితమే ఆయన కాజల్ కుమారీని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని కుటుంబ సమస్యల కారణంగా హనీమూన్ ట్రిప్‌ను వాయిదా వేసుకున్నారు. తాజాగా, వారి హనీమూన్ ట్రిప్ కల నిజం చేసుకోవాలని అనుకున్నారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్ నుంచి వారు న్యూఢిల్లీ - న్యూ జల్పైగురి సూపర్‌ఫాస్ట్ ట్రైన్‌లో జులై 28న బయల్దేరారు.
‘మే బీ4 కోచ్‌లో 43, 45 సీట్లను రిజర్వ్ చేసుకున్నాం. మా ట్రైన్ కిషన్ గంజ్ రైల్వే స్టేషన్ చేరిన తర్వాత నా భార్య టాయిలెట్ కోసం వెళ్లింది. మళ్లీ తిరిగి రాలేదు. ట్రైన్ మళ్లీ స్టార్ట్ అవుతుండగా.. తన భార్య కోసం అన్ని కోచ్‌ల లోనూ వెతికాను. కానీ, ఆమె కనిపించలేదు. దీంతో ముజఫర్‌పూర్‌కు తిరిగి వచ్చాను. కిషన్ గంజ్ జీఆర్ఫీకి ఈ ఘటన గురించి సమాచారం ఇచ్చాను’ అని కాజల్ కుమారీ భర్త తెలిపాడు.
Also Read: నా భార్యకు క్షమాపణలు చెబుతూ ఓ లేఖ రాయ్.. చాట్‌జీపీటీని అడిగాడు.. ఏమని రాసిందంటే?
బహుశా తన భార్య డ్రగ్స్ వ్యసన మూక బారిన పడి ఉంటుందని అనుమానిస్తున్నాడు. తన భార్యకు ఎవరితోనూ ఎలాంటి అక్రమ సంబంధం లేదని వివరించాడు. జీఆర్పీ అధికారులు కిషన్ గంజ్ రైల్వే స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కానీ, ఆమె ఆ సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.