Asianet News TeluguAsianet News Telugu

గంగానదిలో చెక్కపెట్టెలో చిన్నారి: సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందన ఇదీ....

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్ వద్ద గంగానదిలో చెక్కపెట్టెలో దొరికిన  చిన్నారి బాధ్యతను ప్రభుత్వమే తీసుకొంటుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.

Newborn recovered from Ganga: Yogi Adityanath says government will take care lns
Author
Lucknow, First Published Jun 16, 2021, 4:54 PM IST

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్ వద్ద గంగానదిలో చెక్కపెట్టెలో దొరికిన  చిన్నారి బాధ్యతను ప్రభుత్వమే తీసుకొంటుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.21 రోజుల చిన్నారిని చెక్కపెట్టెలో పెట్టి గంగానదిలో వదిలేశారు. ఈ చెక్కపెట్టెలో చిన్నారి ఏడుపులు విన్న స్థానికుడు  గంగానది నుండి ఆ చిన్నారిని కాపాడారు. చిన్నారిని వెంటనే  ఆశాజ్యోతి కేంద్రానికి తరలించారు.  బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 

also read:

 ఈఘటనపై  యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్  స్పందించారు. ఈ చిన్నారి బాధ్యతను  పూర్తిగా తీసుకుంటామని  ప్రకటించినట్టు  ఓ మీడియా ఏజెన్సీ ప్రకటించింది. చెక్క పెట్టెలో బిడ్డతో పాటు కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో కూడా ఉంది.అలాగే  బిడ్డ పుట్టిన జాతకం ప్రకారం ఆ బిడ్డకు 'గంగ' అని పేరు పెట్టినట్లుగా రాసి ఉంది.  ఈ చిన్నారిని కాపాడిన వ్యక్తి ఆ బాలికను పెంచుకొంటానని చెప్పారు. అయితే ఈ విషయమై అధికారులు ఇంకా అనుమతి ఇవ్వలేదు. దీీంతో ఆ బాలికను ఆశాజ్యోతి సెంటర్ కు తరలించారు.గంగానదిలో చెక్కపెట్టెలో చిన్నారి: కాపాడిన స్థానికులు

Follow Us:
Download App:
  • android
  • ios