New Year: 2024 లీపు సంవత్సరమేనా? లీప్‌ డే అంటే ఏమిటీ? ఎందుకు?

కొత్త సంవత్సరంలోకి అడుగిడినాం. ఈ ఏడాది గురించి కొన్ని ప్రత్యేకతలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఏడాది లీపు సంవత్సరం. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి లీపు సంవత్సరం వస్తుంది. గతంలో 2020, భవిష్యత్‌లో 2028 లీపు సంవత్సరంగా ఉంటుంది.
 

new year 2024 is a leap year, what is leap day, why we have and how we calculate leap year kms

Leap Year: కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త నిర్ణయాలు, కొత్త సంకల్పాలు తీసుకుంటారు. కొత్త తీర్మానాలు చేసుకుంటారు. ఈ ఏడాది వాటిని తీర్చుకోవడానికి ఒక రోజు అదనంగానే ఉన్నది. అదేనండీ.. 2024 లీపు సంవత్సరం.  అంటే ఒక రోజు ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఏడాదికి 365 రోజులు. కానీ, లీపు సంవత్సరానికి 366 రోజులు.

ఆ లీపు రోజు ఏ నెలలో ఉంటుంది? రెండో నెల ఫిబ్రవరిలో లీపు రోజు ఉంటుంది. ఏడాదిలో అతిచిన్న నెలల ఫిబ్రవరి. ఈ నెలలో 28 రోజులు ఉంటాయి. కానీ, లీపు ఏడాదిలో ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి. ఈ అదనంగా వచ్చే రోజునే లీప్ డే అంటారు.

లీపు డే ఎందుకు వస్తుంది?

లీప్ డే అంటే నెలలో ఒక రోజును కలపడం అని సింపుల్‌గా అనుకోరాదు. దీని వెనుక పెద్ద తతంగమే ఉన్నది. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒక రోజును అదనంగా కలపాల్సి ఉంటుంది. తద్వార సూర్యుడి చుట్టూ భూమి భ్రమణం.. రుతువుల్లో మార్పు రాకుండా చూసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

భూమి చుట్టూ సూర్యుడు ఒక రౌండ్ వేయడానికి 365 1/4 రోజులు పడుతుంది. అంటే ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక రోజు అదనంగా ఏర్పడుతుంది. ఒక వేళ మనం ఈ రోజును అదనంగా కలుపకపోతే రుతువుల సమయాలు మారుతాయి. ఒక వేళ ఇలా ఒక రోజు అదనంగా కలుపకుంటే ప్రతి 750 సంవత్సరాలకు రుతువులు, వాటి సమయాలు పూర్తిగా విరుద్ధమైపోతాయి. అంటే.. వేసవి కాలం నడిమధ్యలో శీతాకాలం వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే అచ్చుగా రుతువులు మారవు. కానీ, అవి వస్తాయని అంచనా వేసే మన నెలలు మారిపోతాయి.

Also Read: Ayodhya: రామ మందిరంలో ప్రతిష్టించే రామ విగ్రహం ఎవరు చెక్కారు? ఎలా ఉన్నది?

ఎప్పటి నుంచీ?

ఫిబ్రవరి నెలను 29 రోజులకు పెంచాలనే సంస్కరణ రోమన్ క్యాలెండర్ కాలం నాటిది. ఆ క్యాలెండర్‌ను జూలియస్ సీజర్ రూపొందించాడు. రోమన్ క్యాలండర్‌లో 355 రోజులు ఉంటాయి. ఇది సూర్యుడి కేంద్రంగా నడిచే క్యాలెండర్ కంటే చిన్నది. కాబట్టి, ప్రతి యేటా రుతువులకు వారి నెలలకు మధ్య పొంతన లేకుండా పోయింది. దీంతో సీజర్ జూలియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టాడు. అది సూర్యుడి కేంద్రంగా నడిచే క్యాలెండర్. ఇది ఈజిప్షియన్ క్యాలెండర్ ప్రేరణతో రూపొందించింది. ఇందులోనే లీప్ ఇయర్ విధానాన్ని ప్రారంభించారు. 1582లో జూలియన్ క్యాలెండర్‌ను మరోసారి నవీకరించారు. అదే గ్రెగోరియన్ క్యాలెండర్‌గా మారింది. అప్పటి నుంచి ఫిబ్రవరి నెలలో ఒక రోజు అదనంగా కలపడం వస్తూ ఉన్నది.

Also Read : Free Bus: ఏపీ ఎన్నికల పై ‘ మహిళలకు ఉచిత ప్రయాణం ’ ప్రభావం ఎంత ?

ఎలా లెక్కిస్తారు?

ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక దాన్ని లీపు సంవత్సరంగా పరిగణించారు. నాలుగుతో సంపూర్ణంగా భాగించబడే ఏడాదిని లీపు సంవత్సరంగా చెబుతారు. ఇక్కడ ఓ తిరకాసు ఉన్నది. అంటే.. వందతో భాగిస్తే సరిపోదు.. అది 400తో భాగించబడాలి. ఉదాహరణకు 2000 లీపు సంవత్సరం అవుతుంది. కానీ, 2100 లీపు సంవత్సరం కాదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios