Asianet News TeluguAsianet News Telugu

కొత్త పన్ను విధానం ఆకర్షణీయంగా ఉంది - కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

కొత్త పన్ను విధానం ఆకర్శణీయంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రెండు పన్ను చెల్లింపు విధానాల్లో ప్రజలు దేనినైనా ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. 

New tax regime is attractive - Union Finance Minister Nirmala Sitharaman
Author
First Published Feb 2, 2023, 1:01 PM IST

ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని పన్ను చెల్లింపుదారులకు మరింత ఆకర్షణీయంగా మార్చామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మధ్యతరగతి ప్రయోజనాల కోసం దీని నిర్మాణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. దేశానికి ప్రత్యక్ష పన్నుల విధానం అవసరమని, అది సరళంగా, సులభంగా పాటించాలని అన్నారు.ఆదాయపు పన్ను శ్లాబ్‌లకు సంబంధించి బడ్జెట్‌లో చాలా మార్పులు చేశామని, ఇది మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆర్థిక మంత్రి చెప్పారు. ‘‘ కొత్త పన్ను విధానం ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా తయారైంది. దీని వల్ల ప్రజలు ఎలాంటి సంకోచం లేకుండా పాత పద్దతి నుంచి కొత్త పద్దతికి మారవచ్చు’’ అని అన్నారు.

విషాదం : కారులో మంటలు చెలరేగి, గర్భిణి సహా ఇద్దరు వ్యక్తులు సజీవదహనం..

ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్నాయని, ఆ ప్రయత్నాలు సత్ఫలితాలనిచ్చాయని నిర్మలా సీతారామన్ అన్నారు. ఉద్యోగాల కల్పనపై ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ ప్రాజెక్టులు చేపట్టినా వాటిని పూర్తి చేసే సిబ్బందిపై ఆ డబ్బును వినియోగిస్తుందన్నారు. మానవ ప్రమేయం లేకుండా ఒక్క శాతం ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేమని, అందువల్ల క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.

డ్రగ్స్‌ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదని తండ్రిని పొడిచి చంపాడు.. ఢిల్లీలో దుర్ఘటన

కాగా.. 2024 ఆర్థిక సంవత్సరానికి రూ.10 లక్షల కోట్ల మూలధన వ్యయ లక్ష్యాన్ని చేరుకోగలమని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసిందని వ్యయ కార్యదర్శి టీవీ సోమనాథన్ తెలిపారు. కాపెక్స్ వినియోగంలో లోటు రాష్ట్రాల వైపు నుంచి ఉందని, కేంద్రం నుంచి కాదని ఆయన పేర్కొన్నారు. ‘‘నాలుగు ప్రాంతాల్లో కేటాయింపులు పెంచారు. మూలధన వ్యయాన్ని ఉపయోగించడానికి రైల్వే వద్ద తగినన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. హైవేలు ఈ కాపెక్స్ ను గ్రహించడానికి తగిన ప్రాజెక్టులను కలిగి ఉన్నాయి’’ అని తెలిపారు.

కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ కు బెయిల్‌ మంజూరు.. యూపీ జైలు నుంచి విడుదల..

దీనికి తోడు పెట్రోలియం మూలధన వ్యయం ఉద్గార ప్రమాణాలు, కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగా రిఫైనరీలను పునరుద్ధరించడానికి, వ్యూహాత్మక నిల్వలను పెంచడానికి పాక్షికంగా ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది స్థూల పన్నులు 10.5 శాతం వృద్ధి చెందుతాయని, దీని ద్వారా జీడీపీ సర్వే సూచించిన దానికంటే కాస్త తక్కువగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసిందని సోమనాథన్ చెప్పారు. 2025-26 నాటికి ద్రవ్యలోటు లక్ష్యాన్ని 4.5 శాతానికి చేరుకుంటామని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios