Asianet News TeluguAsianet News Telugu

కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ కు బెయిల్‌ మంజూరు.. యూపీ జైలు నుంచి విడుదల..

కేరళ జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్ యూపీ జైలు నుంచి బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చాలా రోజుల తరువాత తాను బయటకు వచ్చానని, ఆనందంగా ఉందని తెలిపారు. 

Kerala journalist Siddique Kappan granted bail.. Released from UP jail..
Author
First Published Feb 2, 2023, 11:47 AM IST

కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ కు బెయిల్ మంజూరు అవడంతో గురువారం జైలు నుండి బయటకు వచ్చారు. తన బెయిల్ కోసం అవసరమైన ష్యూరిటీలను కోర్టులో సమర్పించిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది ప్రత్యేక పీఎంఎల్‌ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) కోర్టులో బుధవారం రూ.లక్ష చొప్పున ఇద్దరి పూచీకత్తులను సమర్పించారు. సిద్ధిక్ కప్పన్ ఉదయం 9.15 గంటలకు కప్పన్ జైలు నుంచి విడుదలయ్యారని లక్నో జిల్లా జైలు జైలర్ రాజేంద్ర సింగ్ వార్తా సంస్థ ‘పీటీఐ’తో తెలిపారు.

పార్లమెంట్‌లో గందరగోళం.. హిడెన్‌బర్గ్ నివేదికపై చర్చకు విపక్షాల పట్టు.. ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా..

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో ముచ్చటించారు. ‘‘28 నెలలు అయ్యింది. చాలా గొడవల తర్వాత బయటకి వచ్చాను. హ్యాపీగా ఉన్నాను. అని అన్నారు. హత్రాస్ పర్యటన ఉద్దేశం ఏమిటని మీడియా ప్రశ్నించగా.. తాను రిపోర్టింగ్ కోసం అక్కడికి వెళ్లానని కప్పన్ చెప్పారు. తనతో పాటు వచ్చిన వారంతా విద్యార్థులేనని చెప్పారు. 

ప్రేమోన్మాది.. కాలేజీ చదివే రోజుల్లో ప్రేమను రిజెక్ట్ చేసిందని.. నాలుగేళ్ల తరువాత యువతిపై విచక్షణారహిత దాడి..

అతడి వద్ద నుంచి లభించిన వస్తువులపై గురించి అడిగినప్పుడు.. తన దగ్గర ల్యాప్టాప్, మొబైల్ మాత్రమే ఉన్నాయని చెప్పారు. అతడి నుంచి కొన్ని అభ్యంతరకర వస్తువులు కూడా లభించాయన్న వార్తలపై ప్రశ్నించనప్పుడు తన వద్ద రెండు పెన్నులు, ఒక నోట్ ప్యాడ్ మాత్రమే ఉందని చెప్పారు.

స్నేహితుడిని చంపి.. కొండమీదినుంచి పారేయబోయి.. పట్టుతప్పి, కిందపడి దుర్మరణం..

2020 అక్టోబర్ లో హత్రాస్ లో ఓ దళిత మహిళ అత్యాచారానికి గురై మరణించింది. ఇది ఆ సమయంలో సంచలనం రేకెత్తించింది. అయితే అక్కడికి వెళ్లేందుకు జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ ప్రయత్నించాడు. దీంతో ఆయనతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. హాథ్రస్ మహిళ మృతిపై హింసను ప్రేరేపించడానికే వారు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. 

బళ్లారి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి గాలి జనార్దన్ రెడ్డి భార్య అరుణ లక్ష్మి

కప్పన్ ఇప్పుడు నిషేధించబడిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలు కలిగి ఉన్నాడని, అతడిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల కింద పోలీసులు అభియోగాలు మోపారు. అయితే ఆ కేసుకు సంబంధించి గత సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసు కారణంగా ఆయన జైలులోనే ఇప్పటి వరకు ఉండిపోయారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios