బెట్టింగ్ ప్రమేయం ఉండే ఆన్‌లైన్ గేమింగ్‌లపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్‌ను గురువారం విడుదల చేసింది. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ మేరకు గురువారం వెల్లడించారు.
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ గేమింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం గురువారం కొత్త రూల్స్ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఈ రూల్స్‌ను నోటిఫై చేసింది. కొత్త రూల్స్ గురించి గురువారం కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడారు. ఈ రూల్స్ ద్వారా ఆన్‌లైన్ గేమింగ్‌లో బెట్టింగ్‌ను నిషేధం విధిస్తున్నామని వివరించారు.
ఏ ఆన్‌లైన్ గేమింగ్‌లకు అనుమతి ఇవ్వాలి? వేటిని నిషేధించాలి? అనే అంశాలపై కొత్త రూల్స్ స్పష్టతనిస్తాయి. ఈ నిర్ణయాలను సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్లు(ఎస్ఆర్‌వో) తీసుకుంటాయి. ఒకటికి మించి ఎస్ఆర్‌వోలు ఉంటాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఎస్ఆర్‌వోలలో పరిశ్రమ ప్రతినిదులు, విద్యా వేత్తలు, చిన్నపిల్లలకు సంబంధించిన నిపుణులు, సైకాలజీ ఎక్స్‌పర్టులు, ఇతర నిపుణులు ఉంటారు. ముందుగానైతే ఇప్పుడు మూడు ఎస్‌ఆర్‌వోలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.
Also Read: ఫోన్ పే, ఇతర యూపీఐ పేమెంట్లపై ఎన్నికల సంఘం నజర్.. ఎలక్షన్‌లో ప్రలోభాలకు చెక్ పెట్టడానికే..
ఈ ఎస్ఆర్‌వోలు ఏ ఆన్‌లైన్ గేమింగ్‌ను అనుమతించాలి? బెట్టింగ్ లేదా వేజరింగ్ జరుగుతున్నదో గుర్తించి వేటిపై నిషేధం విధించాలి? అనే నిర్ణయాన్ని తీసుకుంటాయి. ఆ నిర్ణయాలను తీసుకోవడానికి ఈ కొత్త రూల్స్ ఉపకరిస్తాయి. ఈ కొత్త రూల్స్ ద్వారా బెట్టింగ్ లేదా వేజరింగ్ ప్రమేయం ఉండే ఆన్‌లైన్ గేమింగ్‌లపై నిషేధం పడుతుందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. బెట్టింగ్ ప్రమేయం ఉందంటే.. ఆ ఆన్‌లైన్ గేమింగ్‌ను అనుమతించలేమని ఎస్ఆర్‌వో పేర్కొంటుందని వివరించారు.
