2014లో తాను తొలిసారి పార్లమెంట్ లో ప్రవేశించిన రోజును తాను ఏప్పటికీ మరిచిపోలేనని ప్రధాని మోడీ చెప్పారు.
న్యూఢిల్లీ: 2014లో తాను తొలిసారి పార్లమెంట్ లో ప్రవేశించిన రోజును తాను ఏప్పటికీ మరిచిపోలేనని ప్రధాని మోడీ చెప్పారు.
నూతన పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు.దేశ ప్రజలకు ఇవాళ చారిత్రాత్మకమైన రోజుగా పేర్కొన్నారు. ప్రజలంతా కలిసి నిర్మించుకొంటున్న భవనంగా ఆయన పేర్కొన్నారు.
దేశ ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఈ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు.130 కోట్ల భారతీయులంతా గర్చివే రోజుగా ఆయన పేర్కొన్నారు.ప్రస్తుత పార్లమెంట్ భవనంలోనే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని ఆయన గుర్తు చేశారు.
నూతన పార్లమెంట్ భవనం భారతీయుల ఆకాంక్షలకు ప్రతీకగా నిలుస్తోందని ఆయన చెప్పారు.ఈ భవనంలో రూపొందించిన ప్రతి చట్టం మన గర్వకారణమన్నారు. ఈ భవనం 100 ఏళ్ల పురాతనమైంది. దీన్ని కొనసాగించడానికి అనేక ఏళ్లుగా అవిశ్రాంతంగా మరమ్మత్తు పనులు జరుగుతున్నాయన్నారు.
also read:కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన: పూజలు చేసిన మోడీ
21వ శతాబ్దానికి చెందిన భారతదేశానికి కొత్త పార్లమెంట్ భవనం ఇవ్వడం మనందరి బాధ్యతగా ఆయన చెప్పారు. కొత్త భవనం అధునాతనా టెక్నాలజీతో అనుసంధానం చేయబడుతుందన్నారు.
ప్రస్తుత భవనంలో సామాన్య ప్రజలు తమ ప్రజా ప్రతినిధులను కలుసుకొనే అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కొత్త భవనంలో ప్రతి ఎంపీని కలిసే స్థలం ఉంటుందన్నారు. 21వ శతాబ్దపు కోరిక ఆకాంక్షలను కొత్త భవనం నెరవేర్చనుందని ఆయన చెప్పారు.
ఇవాళ నేషనల్ వార్ మెమోరియల్ ఇండియా గేట్ దాటి కొత్త గుర్తింపును సృష్టించినట్టేనన్నారు. కొత్త పార్లమెంట్ హౌస్ దాని స్వంత గుర్తింపును ఏర్పాటు చేస్తోందని చెప్పారు.
స్వతంత్ర భారత్ లో నిర్మించిన కొత్త పార్లమెంట్ సభను చూస్తే రాబోయే తరాలు గర్వపడతాయన్నారు.సాధారణంగా ప్రజాస్వామ్యంపై చర్చలు ఎక్కువగా ఎన్నికలు పాలన చుట్టూనే తిరుగుతాయని ఆయన చెప్పారు.
అయితే ఇండియాలో మాత్రం ప్రజాస్వామ్యం దేశం యొక్క ఆత్మను ఏర్పరుస్తోందన్నారు. అభిప్రాయబేధాలు ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తాయన్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 10, 2020, 2:53 PM IST