ప్రాంతీయ పార్టీల ఫ్రంట్ దే హవా, బిజెపికి పరాభవమే: చంద్రబాబు

ప్రాంతీయ పార్టీల ఫ్రంట్ దే హవా, బిజెపికి పరాభవమే: చంద్రబాబు

విజయవాడ: 2019లో ప్రాంతీయ పార్టీల కూటమే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. బిజెపిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి ఓటమి తప్పదని అన్నారు. 

తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ ఎన్డీఎ, బిజెపి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు. దేశ రాజకీయాలను మార్చే సత్తా తమ పార్టీకి ఉందని అంటూ కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ కూటములను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

విభేదాలను పక్కన పెట్టి దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకమై దేశ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించాలని అన్నారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వం రాజ్యాంగంలోని లౌకిక విధానాలకు తిలోదకాలు ఇస్తోందని, ఇది దేశానికి ప్రమాదకరమని విమర్శించారు. 

బిజెపి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీల కుట్రల పట్ల పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రానికి చెడు చేయాలని ఆ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆయన అన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NATIONAL

Next page