Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌ను ఊడ్చేసిన ఆప్: ఢిల్లీకి ఇప్పటివరకు సీఎంలుగా పనిచేసింది వీరే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  ఆప్ తన సత్తాను చూపింది. ఇప్పటివరకు ఐదు దఫాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సీఎంలు గా పనిచేశారు. కానీ, నేడు మాత్రం ఆ పార్టీ మాత్రం ఉనికి కోసం ప్రయత్నాలు చేస్తోంది.

New DElhi Results 2020: List of all Chief Ministers of Delhi
Author
New Delhi, First Published Feb 11, 2020, 9:24 AM IST

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ రాష్ట్రంలో  ఐదు దఫాలు  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సీఎంలుగా పనిచేశారు.. కానీ  ఆ పార్టీ  రాష్ట్రంలో తన ఉనికిని చాటుకోవడానికి అష్టకష్టాలు పడుతోంది. కనీసం రెండు అంకెల స్థానాలను అసెంబ్లీలో సాధిస్తే  చాలు అనే పరిస్థితి ఆ పార్టీ  నాయకత్వం ఉంది.

2013లో  అనుహ్యంగా ఆప్ అధికారంలోకి వచ్చింది. ఆప్  ప్రధాన పార్టీలకు సవాల్ విసిరింది. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడ ఆప్ తన సత్తాను చాటే ప్రయత్నం చేస్తోంది. 

 కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అయితే ఢిల్లీ రాష్ట్రంలో గత ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో ఢిల్లీలోని అన్ని ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకొంది. అదే తరహాలో అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఇవ్వాలని ప్రధానమంత్రి మోడీ ప్రజలను కోరారు. కానీ ప్రస్తుతం అందుతున్న ఫలితాలు మాత్రం ఆప్ ఆధిక్యాన్ని సూచిస్తున్నాయి.

1952 మార్చి 17వ తేదీన కాంగ్రెస్ పార్టీ నేత చౌదరి బ్రహ్మం ప్రకాష్ ఢిల్లీ సీఎంగా బాధ్యతలను స్వీకరించారు. 1955 ఫిబ్రవరి 12వ తేదీ వరకు  ఆయన ఈ పదవిలో కొనసాగారు.1955 ఫిబ్రవరి 12వ తేదీ నుండి 1956 నవంబర్ 1వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన గురుముఖ్ నిహల్ సింగ్ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.

Also read:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2020: దూసుకుపోతున్న ఆప్

1956 నుండి 1993 వరకు ఢిల్లీలో రాష్ట్రపతి పాలన  ఉంది. రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.  1993 డిసెంబర్ 2 వ తేదీ నుండి  1996 ఫిబ్రవరి 26వ తేదీ వరకు బీజేపీ ఢిల్లీలో అధికారంలో ఉంది. తొలిసారిగా ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.

1996 ఫిబ్రవరి 26వ తేదీ నుండి 1998 డిసెంబర్ 3వ తేదీ వరకు బీజేపీకి చెంది సాహెబ్ సింగ్ వర్మ ఢిల్లీ సీఎంగా  పనిచేశారు.1998 డిసెంబర్ 3వ తేదీ నుండి 2003 డిసెంబర్ 1వ తేదీ నుండి  బీజేపీ నుండి సుష్మా స్వరాజ్ సీఎంగా పనిచేశారు. ఆ సమయంలో దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు విపరీతంగా పెరగడం, ఢిల్లీలో ముగ్గురు ముఖ్యమంత్రులను బీజేపీ మార్చడంతో కాంగ్రెస్ పార్టీకి తర్వాతి ఎన్నికల్లో  విజయం లభించింది.

1998 డిసెంబర్ 3వ తేదీ నుండి 2003 డిసెంబర్ 1వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ తరపున షీలా దీక్షిత్ సీఎంగా పనిచేశారు. వరుసగా మూడు దఫాలు షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా పనిచేశారు. హ్యాట్రిక్ సీఎంగా పనిచేసిన  చరిత్ర ఆమెపై ఉంది.

ఆ తర్వాత  2003 డిసెంబర్ 1వ తేదీ నుండి 2008 నవంబర్29వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన షీలా దీక్షిత్ రెండో సారి సీఎంగా బాధ్యతల్లో ఉన్నారు. ఇక మూడో టర్మ్‌లో 2008 నవంబర్ 29వ తేదీ నుండి 2013 డిసెంబర్ 28వ తేదీ వరకు ఢిల్లీ సీఎంగా షీలా దీక్షిత్ మూడో దఫా సీఎంగా పనిచేశారు.

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ రాష్ట్రంలో ఉనికి కోసం పాకులాడే ప్రయత్నం చేస్తోంది.  2013 డిసెంబర్ 28వ తేదీ నుండి 2014 ఫిబ్రవరి 14వ తేదీన తొలిసారిగా ఆప్ తరపున  అరవింద్ కేజ్రీవాల్ తొలిసారిగా సీఎంగా బాధ్యతలను చేపట్టారు.

2014 ఫిబ్రవరి 14వ తేదీ నుండి 2015 ఫిబ్రవరి 15వ తేదీ వరకు  ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఉంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఢిల్లీలో మరోసారి ఆప్  అధికారాన్ని దక్కించుకొంది. 2015 ఫిబ్రవరి 14వ తేదీన  రెండోసారి ఆప్ అధికారాన్ని సాధించింది. రెండోసారి అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 

కాంగ్రెస్ పార్టీని ఆప్ ఢిల్లీలో ఊడ్చిపారేసింది. కాంగ్రెస్ స్థానాన్ని ఆప్ పూడ్చిందనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఆప్ కూడ విజయం సాధించేలా ఫలితాలు కన్పిస్తున్నాయి.గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి సీట్ల సంఖ్య  పెరిగే అవకాశం ఉందని తొలిదశ ఫలితాలు కన్పిస్తున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios