Asianet News TeluguAsianet News Telugu

డిసెంబరు 11న మహారాష్ట్ర, గోవాలో పర్యటించనున్న ప్రధాని మోడీ

New Delhi: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మ‌హారాష్ట్ర ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా రూ. 75,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న‌లు చేసి జాతికి అంకితం చేయ‌నున్నారు. నాగ్‌పూర్, షిర్డీలను కలిపే సమృద్ధి మహామార్గ్ మొదటి దశను ప్రధాని ప్రారంభించ‌నున్నారు. సమృద్ధి మహామార్గ్ లేదా నాగపూర్-ముంబ‌యి సూపర్ కమ్యూనికేషన్ ఎక్స్ ప్రెస్ వే, దేశవ్యాప్తంగా మెరుగైన కనెక్టివిటీ-మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధాని దార్శనికతను సాకారం చేసే దిశగా ప్రధాన ముంద‌డుగుగా ప్ర‌భుత్వం పేర్కొంది.
 

New Delhi: Prime Minister Modi will visit Maharashtra and Goa on December 11
Author
First Published Dec 9, 2022, 11:52 PM IST

Prime Minister Modi's tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్ 11న మహారాష్ట్ర, గోవాలలో పర్యటించనున్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌లు చేసి.. జాతికి అంకితం చేయ‌నున్నారు. త‌న మ‌హారాష్ట్ర ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా రూ. 75,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న‌లు చేసి జాతికి అంకితం చేయ‌నున్నార‌ని ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు గురించి మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డిస్తూ.. ఉదయం 9:30 గంటలకు, ప్రధాని నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు, ఫ్రీడమ్ పార్క్ మెట్రో స్టేషన్ నుండి ఖాప్రీ మెట్రో స్టేషన్ వరకు ప్రధాన మంత్రి మెట్రో  ప్ర‌యాణం చేస్తారు. అక్కడ 'నాగ్‌పూర్ మెట్రో మొదటి దశ'ను జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో పీఎం 'నాగ్‌పూర్ మెట్రో ఫేజ్-2'కి శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10:45 గంటలకు, ప్ర‌ధాని మోడీ నాగ్‌పూర్-షిర్డీలను కలుపుతూ సమృద్ధి మహామార్గం మొదటి దశను ప్రారంభిస్తారు. హైవేలో పర్యటనను చేపడతారు. నాగ్‌పూర్‌లోని ఎయిమ్స్‌ను ఉదయం 11:15 గంటలకు ప్రధాని జాతికి అంకితం చేస్తారు.

నాగ్‌పూర్‌లో ఉదయం 11:30 గంటలకు జరిగే బహిరంగ కార్యక్రమంలో ప్రధాని శంకుస్థాపన చేసి 1500 కోట్ల కంటే ఎక్కువ విలువైన జాతీయ రైలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్ (NIO), నాగ్‌పూర్-నాగ్ నది కాలుష్య నివారణ ప్రాజెక్ట్ ల‌కు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో, ప్ర‌ధాన మంత్రి 'సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ (CIPET), చంద్రపూర్'ను దేశానికి అంకితం చేస్తారు. అలాగే, 'సెంటర్ ఫర్ రీసెర్చ్, మేనేజ్‌మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ హిమోగ్లోబినోపతి, చంద్రపూర్'ని కూడా ప్రారంభిస్తారు.

మ‌హారాష్ట్ర ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని గోవాలో, మధ్యాహ్నం 3:15 గంటలకు 9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ వేడుకలో పాల్గొన్ని ప్ర‌సంగిస్తారు. ఈ కార్యక్రమంలో ఆయన మూడు జాతీయ ఆయుష్ ఇనిస్టిట్యూట్‌లను కూడా ప్రారంభిస్తారు. సాయంత్రం 5:15 గంటలకు, గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభిస్తారు.

నాగ్‌పూర్‌లో..

నాగ్‌పూర్-షిర్డీలను కలుపుతూ 520 కిలో మీట‌ర్ల దూరాన్ని కవర్ చేసే సమృద్ధి మహామార్గ్ ఫేజ్-1ని ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. సమృద్ధి మహామార్గ్ లేదా నాగ్‌పూర్-ముంబ‌యి సూపర్ కమ్యూనికేషన్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్, దేశవ్యాప్తంగా మెరుగైన కనెక్టివిటీ-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ప్రధానమంత్రి దృష్టిని సాకారం చేయడంలో ఒక ప్రధాన ముంద‌డుగుగా ప్ర‌భుత్వం పేర్కొంది. 701 కిలో మీట‌ర్ల ఎక్స్‌ప్రెస్‌వే - దాదాపు రూ. 55,000 కోట్లతో నిర్మించబడుతోంది.  మహారాష్ట్రలోని 10 జిల్లాలు, అమరావతి, ఔరంగాబాద్, నాసిక్‌లోని ప్రముఖ పట్టణ ప్రాంతాల గుండా వెళుతున్న భారతదేశపు అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేలలో ఒకటిగా ఉండ‌నుంది. . ఈ ఎక్స్‌ప్రెస్‌వే పక్కనే ఉన్న 14 ఇతర జిల్లాల కనెక్టివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విదర్భ, మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతాలతో సహా రాష్ట్రంలోని దాదాపు 24 జిల్లాల అభివృద్ధికి సహాయపడుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios