రాహుల్‌ ఛాతిపైకెత్తి నిలబడ్డారన్న కాంగ్రెస్ నేత.. దానిని ‘‘ షో చూడటం ’’ అంటారంటూ నెటిజన్ల సెటైర్లు

భారత ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ లాంటి పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన రోజే.. మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. బుధవారం లోక్‌సభలో ఇద్దరు దుండగులు గందరగోళం సృష్టించారు. 

netizens satires on congress supriya shrinet called rahul gandhi a hero during lok sabha security breach ksp

భారత ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ లాంటి పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన రోజే.. మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. బుధవారం లోక్‌సభలో ఇద్దరు దుండగులు గందరగోళం సృష్టించారు. ఓ వ్యక్తి విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూసుకెళ్లగా.. మరో వ్యక్తి గ్యాలరీ నుంచి ఒక రకమైన పొగను వదిలాడు. లోక్‌సభలోకి దూకిన వ్యక్తి .. ఎంపీలు కూర్చొనే టేబుళ్లపైకి ఎక్కి నల్ల చల్లాలను బంద్ చేయాలంటూ నినాదాలు చేశాడు.  చర్చా కార్యాక్రమంలో వున్న వేళ పొగ రావడంతో లోపల ఏం జరుగుతుందో అర్ధం కాక ఎంపీలు పరుగులు తీశారు. 

 

 

ఈ ఘటనకు సంబంధించి సభలో రాహుల్ గాంధీ ప్రవర్తించిన తీరుపై కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాట్ ఓ ఫోటోను షేర్ చేశారు. పార్లమెంట్‌లో ఇద్దరు యువకులు అకస్మాత్తుగా దాడి చేయగా.. సభలో గందరగోళం నెలకొంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ రాహుల్ గాంధీ భయపడలేదని సుప్రియ పోస్ట్ చేశారు. భయపడొద్దు.. చెప్పడం మాత్రమే కాదు.. చేసి కూడా చూపిస్తాం’ అంటూ పోస్ట్ చేశారు సుప్రియ. అలాగే ఆమె చేసిన ఫోటోపై 'పార్లమెంటులో గందరగోళం ఏర్పడినప్పుడు ప్రజా నాయకులు ఛాతీ పట్టుకుని నిలబడి ఉన్నారు' అని రాసి ఉంది.

ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుప్రియ పోస్ట్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. "సుప్రియా శ్రీనాట్, దీన్ని ఛాతీని పైకి పట్టుకుని నిలబడటం అని కాదు, నిలబడి షో చూడటం అంటారు. రెండవ ఫోటో చూడండి, అందులో బిజెపి ఎంపి మనోజ్ కోటక్ దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని కొడుతున్నాడు, దానిని పిల్లలు ఇష్టపడతారని, రాహుల్ గాంధీ భయపడవద్దు ’’ అంటూ నెటిజన్లు ట్వీట్ చేశారు. 

 

 

మరో యూజర్.. ‘పప్పుని సభికులు హీరోని చేస్తున్నారని.. ఈ సుప్రియ గారు.. దీన్నే డేరింగ్ అంటారు’ అని పోస్ట్ చేశాడు. దీనికి అదనంగా నరేంద్ర మోడీ పాత వీడియోతో కూడిన ట్వీట్‌ను పంచుకున్నారు. ఈ వీడియో పాట్నాలోని గాంధీ మైదాన్‌లో నరేంద్ర మోడీ ర్యాలీకి సంబంధించినది. ప్రధాని వేదికపై ఉన్న సమయంలో గాంధీ మైదాన్‌లో బాంబు పేలుళ్లు జరిగాయి. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, క్షేమంగా ఇంటికి వెళ్లాలని ప్రధాని విజ్ఞప్తి చేశారని పంచుకున్నాడు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios