ఆదిపురుష్ సినిమాలో హనుమంతుడి ఫొటో పక్కన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఫొటో జోడించి ఈ సినిమాలో ఏక్‌నాథ్ షిండే ఉన్నాడా? అంటూ ఓ ట్విట్టర్ యూజర్ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. ఈ ట్వీట్‌కు వెంటనే థానే సిటీ పోలీసులు రియాక్ట్ అయ్యారు.
ముంబయి: ఓ నెటిజన్ మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే పైనే హేళనగా కామెంట్ చేశాడు. ఈ రోజు విడుదలైన ఆదిపురుష్ సినిమాలోని హనుమంతుడి చిత్రం ఒకటి తీసుకుని పక్కనే ఏక్‌నాథ్ షిండే చిత్రాన్ని జోడించి.. ఆదిపురుష్ సినిమాలో ఏక్‌నాథ్ షిండే ఉన్నాడని తెలియదని వ్యంగ్యంగా వ్యాఖ్య చేశాడు. ఈ ట్వీట్ కు థానే సిటీ పోలీసులు రియాక్ట్ కావడం గమనార్హం. ఏదీ... ఒక సారి నీ నెంబర్ షేర్ చేయమ్మా.. అన్నట్టుగా రియాక్ట్ అయింది. డీఎం ద్వారా నెంబర్ షేర్ చేయాలని థానే సిటీ పోలీసులు అడిగారు.
అంతటితో ఆ సంభాషణ ఆగలేదు. ఆ ట్విట్టర్ యూజర్ థానే పోలీసులకూ రియాక్ట్ అయ్యాడు. ఎందుకు సార్.. ఏంటి సంగతి? అంటూ అడిగాడు. ఆ తర్వాత కూడా థానే సిటీ పోలీసులు మరో ట్వీట్ చేశారు. లేదంటే.. ఈ నెంబర్‌కు కాల్ చేయ్ అంటూ మొబైల్ నెంబర్ అక్కడ పోస్టు చేశారు. ఆ తర్వాత ఆ యూజర్ రియాక్ట్ కాలేదు.
Also Read: Adipurush: ఆదిపురుష్ సినిమాపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టులో హిందు సేన దాఖలు..అభ్యంతరాలివే
అయితే, ఆ తర్వాత వచ్చిన కామెంట్లకూ ఆ యూజర్ రియాక్ట్ అవుతూ వెళ్లారు. అందులో కామెడీని అర్థం చేసుకోవాలని, పూర్ హ్యూమర్ అంటూ ఇతర యూజర్లపై కామెంట్లు చేశాడు.
ఈ ట్వీట్‌ను కొందరు హాస్యంగా స్వీకరించగా.. చాలా మంది అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎగతాళి చేస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు. ఫోన్ నెంబర్ ఇవ్వాలని పోలీసులు కోరిన నేపథ్యంలో కింద మరొక యూజర్.. సార్ అతడిని ట్రీట్ చేయడం కూడా లైవ్ స్ట్రీమ్‌లో పెట్టాలని పేర్కొన్నారు.
ఏక్‌నాథ్ షిండే రాజకీయ ప్రస్థానం థానే నుంచి ప్రారంభం కావడం గమనార్హం.
