నాలుగేళ్ల తన కూతురిపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం చేశాడని ఓ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ : నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఆదివారం 40 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ద్వారక సెక్టార్ 16-ఎ జెజె కాలనీలో నివాసం ఉంటున్న రామ్ ప్రకాష్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగేళ్ల పాప తల్లి తన కూతురిపై అత్యాచారం చేశాడని తమ పొరుగింటి వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు.
నిందితులపై బాలల లైంగిక నేరాల రక్షణ చట్టం (పోక్సో) కింద కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, ఈ వారం ప్రారంభంలో, మూసివేసిన ఎంసీడీ పాఠశాలలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినందుకు 27 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. అతడు వేసుకున్న పసుపు చొక్కా ద్వారా గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిందితుడిని మోనుగా గుర్తించామని, అతడు వివాహితుడు అని పోలీసులు తెలిపారు.
తెగ మద్యం తాగేసి.. మత్తులో కొడవలితో మర్మాంగాన్నికోసుకున్నాడు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ధరించిన పసుపు రంగు చొక్కా అతడిని పట్టించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. బాధితురాలి తల్లిదండ్రులు పాఠశాలలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారని, కొద్దిరోజులుగా పాఠశాల మూతపడింది. ఇందులో బాధిత కుటుంబసభ్యులు ఉంటున్నారు. కాగా, బాధితురాలి తల్లిదండ్రులు పాఠశాలలో లేని సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు"
"కాంట్రాక్టు కార్మికులైన తల్లిదండ్రులు తమ వేతనాలు తీసుకోవడానికి బయటికి వెళ్లారు. ఆ సమయంలో 16 ఏళ్ల బాధితురాలు, ఆమె 18 ఏళ్ల అక్క ఒంటరిగా స్కూల్లో ఉన్నారు. ఉదయం 11.30 గంటలకు, ఒక వ్యక్తి పాఠశాలలోకి చొరబడి మొదట దోపిడీకి పాల్పడ్డాడు. తరువాత వంటింట్లోనుంచి కత్తిని తీసుకున్నాడు. కత్తితో బెదిరించి 16 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు" అని పోలీసులు తెలిపారు.
తల్లిదండ్రులు ఇంటికి వచ్చాక విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. దీంతో దీని మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్యాచారం, దోపిడీకి సంబంధించిన ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో.. నిందితుడు పసుపు చొక్కా ధరించి ఉన్నాడని మైనర్ బాలిక తెలియజేసింది. సీసీటీవీ ఫుటేజీలో పసుపు రంగు చొక్కా ధరించిన నిందితుడి అస్పష్టమైన చిత్రం కనిపించడంతో నిందితుడిని గుర్తించారు. ఇదే నిందితుడిని అరెస్టు చేయడంలో సహాయపడిందని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
