తాగిన మత్తులో తన మర్మాంగాన్ని తానే కోసుకున్నాడో వ్యక్తి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.
కర్ణాటక : కర్ణాటకలో ఓ ఘటన కలకలం రేపింది. తాగిన మత్తులో ఓ వ్యక్తి తనని తాను తీవ్రంగా గాయపరచుకున్నాడు. కొడవలితో తన మర్మాంగాన్ని తానే కోసుకున్నాడు. దీంతో ఈ ఘటన కర్ణాటకలో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మైసూరు జిల్లా హుణసూరు తాలూకాలో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇది గమనించిన చుట్టుపక్కల వారు బాధితుడుని వెంటనే హుణసూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. సమయానికి తీసుకురావడంతో అతడికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
హుణసూరు తాలూకా తొండాళుకు చెందిన రాజశెట్టి (40) అనే వ్యక్తి శనివారం రాత్రి మద్యం తాగాడు. ఆ తర్వాత ఇంటికి బయలుదేరాడు. వెళ్లే దారిలో ఎదురుపడ్డ ప్రతి ఒక్కరితో గొడవ పడుతూ వెళుతున్నాడు. దీంతో అందరూ అతడిని మందలించారు. దగ్గరుండి ఇంటిదగ్గర వదిలిపెట్టారు. అయితే తనను అందరూ మాటలన్నారని.. కోపానికి వచ్చిన అతను కేకలు వేస్తూ.. ఇంట్లో ఉన్న కొడవల్ని తీసుకుని మర్మాంగాన్ని కోసుకున్నాడు. దీంతో కిందపడిపోయాడు. రక్త స్రావం మొదలైంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. దీనిమీద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హుణసూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు జరుగుతోంది.
మహారాష్ట్ర ఆలయంలో ఘోర ప్రమాదం.. గాలివానలతో వేపచెట్టు కూలి రేకులషెడ్డుపై పడటంతో ఏడుగురు భక్తుల మృతి
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఈ మార్చిలో బీహార్ లో ఒకటి వెలుగు చూసింది. మద్యం అనేక విచిత్రాలు చేయిస్తుంది. ఆ మత్తు తలకెక్కిన తర్వాత ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో అనేక నేరాలకు పాల్పడడం కనిపిస్తూనే ఉంటుంది. మద్యం మత్తులో తనకు పగ ఉన్న వారిని చంపడం.. అత్యాచారాలకు పాల్పడడం.. నేరాలకు ఒడిగట్టడం తరచూ చూస్తుంటాం. ఈ క్రమంలోనే ఓ మందుబాబు పీకలదాకా మద్యం తాగిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఓ నాగుపాము కనబడితే దానిని మెడలో వేసుకుని ముద్దులు పెట్టాడు. విన్యాసాలు చేశాడు.
ఈ మందు బాబు చేసిన హడావుడికి.. పాము బెదిరిపోయింది.. మామూలుగానే మనిషి కనబడితే కాటు వేసే పాము.. ఇంత హంగామా చేసాక ఊరుకుంటుందా… ఆత్మరక్షణలో భాగంగా కసిదీరా కాటువేసింది. దీంతో సదరు మందుబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన బీహార్లో వెలుగు చూసింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బీహార్ లోని నవాద జిల్లాలోని గోవిందపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే దిలీప్ యాదవ్ అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం తాగాడు.
ఆ తర్వాత కామ్ గా ఇంట్లోకి వెళ్లి పడుకోకుండా అటుగా వెళుతున్న పామును పట్టుకొని మెడలో వేసుకున్నాడు. గుడి ముందుకు వెళ్లి సాష్టాంగ నమస్కారాలు చేశాడు. తనను క్షమించమంటూ దేవుడిని కోరాడు. పామును మెడలో వేసుకుని కాసేపు చిందులేస్తూ హంగామా చేశాడు. కాసేపటికే కుప్పకూలిపోయాడు. తర్వాత అతడిని పాము కాటు వేసింది. ఇప్పటివరకు అతడి చేస్తున్న విన్యాసాలను చోద్యం చూసిన స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతడు మృతి చెందినట్లు ధృవీకరించారు.
