తొమ్మిదేళ్ల చిన్నారిపై పక్కింటి వ్యక్తి అత్యాచారం.. చాక్లెట్ ఆశచూపి....
కాలనీలోని ఒక ఇంట్లో నుంచి పాప గట్టిగా అరుస్తున్నట్లు వినిపించింది. ఆ కేకలు విన్న ఇరుగుపొరుగువారు వెళ్లి చూడగా.. వీరిని చూసి ఆ ఇంటి యజమాని పరుగులు తీశాడు..తీరా లోపలికి వెళ్లి చూసేసరికి పాప అర్థనగ్నంగా ఉంది. ఇది చూసిన కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ లో జరిగింది.
జైపూర్ : రాజస్థాన్ లో దారుణ ఘటన జరిగింది. ఇంటిముందు ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి దారుణానికి ఒడిగట్టాడో కామాంధుడు. ఇరుగు పొరుగు వారు గమనించడంతో ఆ చిన్నారి పెను ప్రమాదం నుంచి బయటపడింది.
Jaipur లోని ఓ కాలనీలో ఓ 9 ఏళ్ళ పాప బయట ఒంటరిగా ఆడుకుంటుంది. ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. ఆ తరువాత కాసేపటికి కాలనీలోని ఒక ఇంట్లో నుంచి పాప గట్టిగా Screaming వినిపించింది. ఆ కేకలు విన్న ఇరుగుపొరుగువారు వెళ్లి చూడగా.. వీరిని చూసి ఆ ఇంటి యజమాని పరుగులు తీశాడు..తీరా లోపలికి వెళ్లి చూసేసరికి పాప Half nakedగా ఉంది. ఇది చూసిన కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. జైపూర్లోని ఒక కాలనీలో ఉండే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. వారికి 9 ఏళ్ళ పాప ఉంది. ముగ్గురే ఉంటారు. అయితే ఆ రోజు స్కూలుకు holiday ఉండడంతో పాప ఇంటి వద్ద ఒంటరిగా ఉంది. పాప తల్లి పక్కింటి ఆంటీకి పాపను కాస్త చూడమని అప్పజెప్పి, ఉద్యోగానికి వెళ్ళిపోయింది.
తల్లి వెళ్లిన కాసేపటికి పాప తాను బయట ఆడుకుంటానని ఆమెకు చెప్పి.. బైటికి వచ్చింది. అక్కడ ఆడుకుంటుంది. ఇది ఓ వ్యక్తి గమనించాడు. అలా పాప బయట ఆడుకుంటున్న సమయంలో అదే కాలనీలో ఉండే ఒక అంకుల్ చాక్లెట్ ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ తరువాత పాప పై అత్యాచారం చేయబోగా పాప భయపడి ఏడుస్తూ గట్టిగా అరిచింది,
పాప అరుపులకు సదరు ఆంటీ, ఇరుగుపొరుగువారు ఏమైందోనని పరుగు పరుగున వెళ్లి చూశారు. వారంతా రావడం చూసిన అంకుల్ పారిపోయాడు. చిన్నారి వారికి అర్ధ నగ్నంగా కనిపించింది. దీంతో ఏమై ఉంటుందో వారు ఊహించారు. షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు పోక్సో చట్టం కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇలాంటి ఘటనే డిసెంబర్ 15న తెలంగాణ లోని ఖమ్మంలో వెలుగులోకి వచ్చింది. ఖమ్మం : మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఓ యువతికి Chocolate ఆశ చూపి అత్యాచారం చేశాడో కీచకుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలానికి చెందిన Mental disability కలిగిన 22 యేళ్ల యువతి మీద అదే గ్రామానికి చెందిన 58 సంవత్సరాల లాకావత్ దేవ్లా Sexual assault చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 13వ తేదీ సోమవారం ఇంట్లో ఎవ్వరూలేని సమయంలో ఒంటరిగా ఉన్న యువతికి లాకవత్ దేవ్లా.. చాక్లెట్, డబ్బులు ఆశ చూపి ఇంట్లోకి రప్పించుకున్నాడు. ఆ తరువాత ఆ అమాయకురాలి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ క్రమంలో ఆమె ఏడవడంతో గమనించిన చుట్టుపక్కలవారు.. ఇంట్లోకి వచ్చారు. వారిని చూసి దేవ్లా పరారయ్యాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇల్లెందు ఎష్ఐ కుమారస్వామి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. లైంగిక దాడికి పాల్పడిన దేవ్లా పరారీలో ఉన్నాడు.