ఇదివరకే మూడు పెళ్లిళ్లు.. నాలుగేళ్లుగా యువతికి డ్రగ్స్ ఇచ్చి... లైంగిక దాడి.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
మంగళూరు నగరంలోని బిజై ప్రాంతానికి చెందిన మహిళ తన కూతురికి కొందరు డ్రగ్స్ కు అలవాటు చేసి లైంగికంగా వాడుకున్నట్లు ఈ నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోనూ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
యశ్వంతపుర : తీరప్రాంత నగరం మంగళూరులో దారుణం వెలుగుచూసింది. నాలుగేళ్ల నుంచి ఒక యువతికి drugs ఇచ్చి Sexual assaultకి పాల్పడుతున్నట్లు ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంగళూరు నగరంలోని బిజై ప్రాంతానికి చెందిన మహిళ తన కూతురికి కొందరు డ్రగ్స్ కు అలవాటు చేసి లైంగికంగా వాడుకున్నట్లు ఈ నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోనూ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
కూతురిని ఇలా నాశనం చేశారని మీడియా ముందు విలపించింది. కూతురు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని తెలిపింది. ఆమెను కాపాడాలని విహెచ్పి నాయకులను కూడా ఆశ్రయించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ జరిపి సురత్కల్‌కు చెందిన మహమ్మద్ షరీఫ్ (47) అనే నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. అతనికి ఇదివరకే మూడు పెళ్లిళ్లు అయినట్లు తేలింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఇదిలా ఉండగా, కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తమిళనాడులో ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరు జిల్లా అన్నూర్ ప్రాంతంలో 37 ఏళ్ల వ్యక్తి తన భార్య లేని సమయంలో తన 10 ఏళ్ల కుమార్తెపై ఇంట్లోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు మద్యం మత్తులో కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది.
ఓ జాతీయ దినపత్రిక ప్రచురించిన కథనం మేరకు.. 5వ తరగతి చదువుతున్న బాధితురాలు.. తన తల్లి ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి చేసిన దారుణాన్ని చెప్పింది. దీంతో సదరు మహిళ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. మంగళవారం అతనిని అరెస్టు చేసి ప్రత్యేక పోక్సో కోర్టులో హాజరుపరిచారు. అనంతరం అతన్ని పల్లడం సబ్ జైలులో జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
కాగా.. కొద్దిరోజుల క్రితం బీహార్‌లోనూ కన్నబిడ్డపై తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. Muzaffarpur జాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఈ కేసులో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్ఐ చాందిని కుమారి సవారియా గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరోవైపు దర్యాప్తులో బాలిక చేసిన ఆరోపణలు నిజమని తేలింది.
ఈ ఘటన మీద గ్రామంలో మూడు రోజులుగా సెటిల్ మెంట్ కు ప్రయత్నించారు. ఐతే గ్రామానికి చెందిన 15 మంది నిందితుడిని కర్రలు, రాడ్లతో దేహశుద్ధి చేశారు. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కన్నతండ్రే కూతురి మీద అత్యాచారానికి పాల్పడుతున్న ఉదంతాలు ఈ మధ్యకాలంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. సభ్యసమాజం తలదించుకునేలా ఇలాంటి సంఘటనలు జరగడం విచారకరమని పోలీస్ అధికారులు మీడియాకు తెలిపారు.