నీట్ పీజీ కౌన్సెలింగ్ (NEET PG Counselling) నిర్వహించేందుకు సుప్రీం కోర్టు (Supreme Court) ఇటీవల అనుమతించిన సంగతి తెలిసిందే. దీంతో నీట్ పీజీ కౌన్సెలింగ్ ప్రారంభ తేదీని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా (Mansukh Mandaviya) ఆదివారం వెల్లడించారు.

నీట్ పీజీ కౌన్సెలింగ్ (NEET PG Counselling) నిర్వహించేందుకు సుప్రీం కోర్టు (Supreme Court) ఇటీవల అనుమతించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే 2021-22 ఏడాదికి నీట్-పీజీ ప్రవేశాలకు మార్గం సుగమైంది. ఈ క్రమంలోనే కేంద్రం నీట్ పీజీ కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ నెల 12 నుంచి నీట్ పీజీ కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా (Mansukh Mandaviya) ఆదివారం తెలిపారు. 

‘గౌరవనీయమైన సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి.. రెసిడెంట్ వైద్యులకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చినట్లుగా జనవరి 12, 2022 నుంచి మెడికల్ కౌన్సెలింగ్‌ కమిటీ ద్వారా NEET-PG కౌన్సెలింగ్ ప్రారంభించబడుతోంది. ఇది కోవిడ్-19పై పోరులో దేశానికి మరింత బలం చేకూరుస్తుంది. అభ్యర్థులందరికీ నా శుభాకాంక్షలు’ అని మన్సుఖ్ మాండవియా ట్వీట్ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడికావాల్సి ఉంది. 

Scroll to load tweet…

NEET PG 2021 ప్రవేశాల్లో.. ఆలిండియా కోటా (AIQ) కేటగిరీలో ఓబీసీలకు 27 శాతం కోటా, ఈడబ్ల్యూఎస్‌కి 10 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తూ కేంద్రం జూలై 29న నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే నీట్-పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్/ఓబీసీ కోటాను సవాల్ చేస్తూ పలువురు నీట్ అభ్యర్థులు సుప్రీం కోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టులో విచారణ కొనసాగింది. మరోవైపు కౌన్సెలింగ్‌ను త్వరగా నిర్వహించాలని దేశవ్యాప్తంగా పలుచోట్ల రెసిడెంట్ డాక్టర్లు నిరసనల చేపట్టారు.

ఈ క్రమంలోనే నీట్ పీజీ కౌన్సెలింగ్‌కు సంబంధించి అత్యవసర విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. బీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌కి 10 శాతం రిజ్వరేషన్ల రాజ్యాంగ చెల్లుబాటును సుప్రీం కోర్టు సమర్ధించింది. లబ్దిదారుల్ని గుర్తించేందుకు రూ. 8 లక్షల ఆదాయ పరిమితికి సుప్రీం కోర్టు ఒకే చెప్పంది. ఇందుకు సంబంధించి మార్చి మూడో వారంలో విచారణ చేపట్టనున్నట్టుగా సుప్రీం కోర్టు తెలిపింది. ఈడబ్ల్యూఎష్ చెల్లుబాటును పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. ప్రస్తుతం జరుగుతన్న ప్రవేశాలు సుప్రీం కోర్టు తుదితీర్పునకు లోబడి ఉండనున్నాయి.