Asianet News TeluguAsianet News Telugu

హైకోర్టు వ్యాఖ్యలు, కరోనా వేళ ప్రభుత్వానికి జూడాల షాక్... ఒకేసారి 3 వేల మంది రాజీనామా

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ జూనియర్ డాక్టర్లు సమ్మె పేరుతో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీలలో జూడాలు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్‌లో దాదాపు 3వేల మంది జూనియర్ డాక్టర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
 

Nearly 3000 Madhya Pradesh Doctors Resign After Court Says Strike Illegal ksp
Author
Bhopal, First Published Jun 4, 2021, 4:47 PM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ జూనియర్ డాక్టర్లు సమ్మె పేరుతో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీలలో జూడాలు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్‌లో దాదాపు 3వేల మంది జూనియర్ డాక్టర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నాలుగు రోజుల వైద్యుల సమ్మెను చట్టవిరుద్ధమని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది... అంతేకాకుండా జూనియర్ డాక్టర్లు 24 గంటల్లో తిరిగి విధుల్లో చేరాలని న్యాయస్థానం గురువారం ఆదేశించింది. కానీ, జూడాలు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని ప్రకటించారు. 

రాష్ట్రంలోని ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న దాదాపు 3 వేల మంది జూనియర్ వైద్యులు గురువారం రాజీనామా చేశారు. తమ రాజీనామాలను ఆయా కళాశాలల డీన్‌లకు సమర్పించినట్లు మధ్యప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఎంపీజేడీఏ) తెలిపింది. డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. స్టయిపెండ్ పెంచాలని తమకు, తమ కుటుంబాలకు కోవిడ్ సోకితే ఉచిత వైద్యం అందజేయాలని జూనియర్ వైద్యులు డిమాండు చేస్తున్నారు. అంతేకాదు, పీజీ మూడో సంవత్సరం నమోదును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని, అందువల్ల తాము పరీక్షలకు హాజరుకాబోమని తేల్చి చెప్పారు.

Also Read:ఏపీలో ఆందోళన బాటలో జూనియర్ డాక్డర్లు

మెడికల్ ఆఫీసర్ల సంఘం, రెసిడెంట్ డాక్టర్ల సంఘాలు కూడా త్వరలో సమ్మెలో పాల్గొంటాయని జూడాల సంఘం వెల్లడించింది. రాజస్థాన్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, బిహార్, మహారాష్ట్ర, ఎయిమ్స్-రిషికేష్ జూనియర్, సీనియర్ వైద్యులు తమకు మద్దతు తెలిపారని వారు తెలిపారు. న్యాయమైన తమ డిమాండ్లను నెరవేర్చుతామని మే 6న హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇంత వరకూ ఎటువంటి చర్యలు చేపట్టలేదని వారు ఆరోపించారు. స్టయిపెండ్‌ను పెంచుతున్నట్టు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాతే విధుల్లో పాల్గొంటామని జూడాలు స్పష్టం చేశారు. 

కాగా, శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల్లోగా జూడాలు విధుల్లోకి చేరాలని హైకోర్టు ఆదేశించింది. ఈ సమయంలోగా వైద్యులు విధుల్లోకి చేరకుంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవచ్చని చీఫ్ జస్టిస్ మహమ్మద్ అహ్మద్, జస్టిస్ సుజోయ్ పాల్ ధర్మాసనం పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios