Asianet News TeluguAsianet News Telugu

ఎన్డీఆర్ఎఫ్ ట్విట్టర్ ఖాతా హ్యాక్: దర్యాప్తు కొనసాగింపు

ఎన్డీఆర్ఎఫ్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ కు గురైంది. ఈ విషయమై విచారణ కొనసాగుతుంది.  గతంలో ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతాను కూడా హ్యాక్ అయిన విషయం తెలిసిందే.

NDRFs Twitter Account Briefly Hacked, Probe Underway
Author
New Delhi, First Published Jan 23, 2022, 12:02 PM IST

న్యూఢిల్లీ: NDRF కి చెందిన అధికారిక Twitter ఖాతా హ్యాక్ కు గురైంది.  ఎన్డీఆర్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాన్ని ఆదివారం నాడు వెల్లడించారు. ఈ విషయమై నిపుణుల కమిటీ దర్యాప్తు చేస్తోందని ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ చెప్పారు.

ఈ నెల 19న తన 17వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొన్న ఎన్డీఆర్ఎఫ్ ట్విట్టర్ ఖాతా హ్యాక్  కు గురైంది. తాము పోస్టు చేసిన ట్వీట్ లు కూడా కన్పించడం లేదని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు.ఎన్డీఆర్ఎఫ్ హ్యాండిల్ ను త్వరలోనే పునరుద్దరిస్తామని సీనియర్ అధికారి చెప్పారు.   

ప్రకృతి వైపరీత్యాల సమయంలో  పనిచేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ ను 2006లో ఏర్పాటు చేశారు. కేంద్ర  హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ పనిచేస్తోంది. అతి తక్కువ కాలంలోనే 1.44 లక్షల మంది మనుషుల ప్రాణాలను ఎన్డీఆర్ఎఫ్ కాపాడింది. దేశంలో, విదేశాల్లో విపత్తు  పరిస్థితుల నుండి ఏడు లక్షల మందికి పైగా ఒంటరిగా ఉన్న వ్యక్తులను ఎన్డీఆర్ఎఫ్ రక్షించింది. 2011లో Japan లో సంబవించిన ట్రిపుల్ డిజాస్టర్, 2015లో Nepal  లో సంబవించిన Earth quake సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సమర్ధవంతంగా పనిచేసింది.

ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం రోజున  ప్రధాని నరేంద్ర మోడీ ఆ సంస్థ పనితీరును అభినందించారు. ఎన్డీఆర్ఎఫ్, ధైర్యం, వృత్తి నైపుణ్యం చాలా ప్రేరేపితమైనన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ట్విట్టర్  ఖాతా కూడా గతంలో హ్యాక్ అయిన విషయం తెలిసిందే.  ఈ విషయం గుర్తించిన వెంటనే ట్విట్టర్ అప్రమత్తమైంది.  కొన్ని గంటల్లో ప్రధాని ట్విట్టర్ యధావిధిగా పనిచేసేలా ట్విట్టర్ సంస్థ చర్యలు తీసుకొంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios