Asianet News TeluguAsianet News Telugu

NDA meet: 60 ఏళ్ల తర్వాత వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు.. ఎన్డీయే నాయకుడుగా మోడీ ఏకగ్రీవం..

NDA leaders meet: లోక్‌సభ ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి ఎన్డీయే తొలి సమావేశం బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని నివాసంలో జరిగింది. గంటపాటు జరిగిన సమావేశంలో మోదీని ఎన్డీయే నాయకుడిగా ఎన్నుకున్నారు.

NDA leaders support BJP, approve PM Modi's name as alliance leader KRJ
Author
First Published Jun 5, 2024, 7:32 PM IST | Last Updated Jun 5, 2024, 7:32 PM IST

NDA meet: లోక్‌సభ ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే తొలి సమావేశం బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని నివాసంలో జరిగింది. గంటపాటు జరిగిన సమావేశంలో మోదీని ఎన్డీయే నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి 16 పార్టీలకు చెందిన 21 మంది నేతలు హాజరయ్యారు. ఎన్డీయే ఎంపీలు జూన్ 7న సమావేశం కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాత్రి 7.30 గంటల పాంత్రంలో ఏన్డీయే నేతలు రాష్ట్రపతిని కలుసుకోనున్నారు.

నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాల్సిందిగా రాష్ట్రపతిని కోరనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందంటూ భాగస్వామ్య పార్టీల మద్దతుతో కూడిన లేఖను అందజేయనుంది. మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ ఈనెల 8న ప్రమాణస్వీకారం చేసేందుకు నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. మిత్రపక్షాలందరితో ఒకరితో ఒకరు మాట్లాడి కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించే బాధ్యతను రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డాలకు అప్పగించారు. 1962 తర్వాత కేంద్రంలో ఒకే పార్టీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారి అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు
 
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు వచ్చాయి. ఇది మెజారిటీ సంఖ్య (272) కంటే 32 సీట్లు తక్కువ. అయితే ఎన్డీయే 292 సీట్లతో మెజారిటీ మార్కును దాటేసింది. ఎన్డీయేలో 16 సీట్లతో చంద్రబాబుకు చెందిన టీడీపీ రెండో అతిపెద్ద పార్టీగా, 12 సీట్లతో నితీశ్‌కు చెందిన జేడీయూ మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ సమయంలో బీజేపీకి ఈ రెండు పార్టీలు అవసరం. వారు లేకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios