పాట్నా: అన్ని సర్వేలు, నివేదికలు ఎన్డీయేనే బీహార్ లో అధికారంలోకి వస్తోందని చెబుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 

బీహార్ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం నాడు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.2014 తర్వాత బీహార్ లో అభివృద్ధి డబుల్ రైలింజన్ లా పరిగెడుతోందన్నారు.కరోనా కాలంలో పేదల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేశామన్నారు. 

also read:బీహార్ ఎన్నికలు:ఆస్తులున్న అభ్యర్ధులు వీరే

బీహార్ రాష్ట్రంలో వేగవంతమైన లేకపోతే కరోనా వ్యాధి ఇంకా చాలా మందిని చంపేదని ఆయన అభిప్రాయపడ్డారు.కరోనాకు వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేసిన భీహార్ ప్రజలను ఆయన అభినందించారు.

బీహార్ ఇటీవల ఇద్దరు కుమారులను కోల్పోయిందని ఆయన గుర్తు చేశారు. చివరి శ్వాస వరకు తనతో ఉన్న రామ్ విలాస్ పాశ్వాన్ కు నివాళులర్పిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. దళితుల సంక్షేమం కోసం తన జీవితాన్ని ఆయన ఫణంగా పెట్టారన్నారు. అదే విధంగా రఘువంశ్ ప్రసాద్ సింగ్ కూడ పేదల కోసం పనిచేశారని ఆయన గుర్తు చేశారు. ఆయనకు కూడా నివాళులర్పిస్తున్నానని ఆయన తెలిపారు.

బీహార్ ఓటర్లు రాష్ట్రాన్ని బీమరుగా మార్చిన చరిత్ర ఉన్నవారిని తమ దగ్గరికి రానివ్వొద్దని నిర్ణయం తీసుకొన్నారని ఆయన చెప్పారు.

ఒకప్పుడు బీహార్ ను పాలించిన వారు మళ్లీ అభివృద్ది చెందుతున్న రాష్ట్రాన్ని తమ అత్యాశ కళ్లతో చూస్తున్నారన్నారు. కానీ వారిని బీహార్ ను వెనుకకు నెట్టారన్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, అవినీతిని మరింత దిగజారాయని పరోక్షంగా ఆర్జేడీపై విమర్శలు గుప్పించారు.

కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ను రద్దు చేశాం, కానీ విపక్షాలు తిరిగి ఈ ఆర్టికల్ ను పునరుద్దరించేందుకు ప్రయత్నించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.