పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నాలుగు విడతలుగా  ఈసీ నిర్వహించనుంది. ఈ  ఎన్నికల్లో ఆర్జేడీకి చెందిన  చెందిన  అనంత్ కుమార్ అత్యధిక సంపద కలిగిన అభ్యర్ధిగా నిలిచినట్టుగా  ఏడీఆర్ సంస్థ ప్రకటించింది.

also read:బీజేపీ మేనిఫెస్టో: బీహార్‌లో 19 లక్షల ఉద్యోగాలు, అందరికీ కరోనా వ్యాక్సిన్

ఏడీఆర్ సంస్థ బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల గురించి అధ్యయనం చేసింది. ఎవరికెన్ని ఆస్తులున్నాయో ఆ సంస్థ ప్రకటించింది.తొలి విడత పోలింగ్ జరగనున్న స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు సంబంధించిన సమాచారాన్ని ఏడీఆర్ విడుదల చేసింది.

ఏడీఆర్ నివేదిక ప్రకారంగా 41 మంది ఆర్జేడీ అభ్యర్ధుల్లో 39 మంది, జేడీ (యూ) అభ్యర్ధుల్లో 35 మందిలో 31 మంది, బీజేపీకి చెందిన 29 మందిలో 24 మంది, 41 మంది 41 మంది ఎల్జేపీ అభ్యర్ధుల్లో 30 మంది, 26 మందిలో 12 మంది బీఎస్పీ అభ్యర్ధుల ఆస్తులు సుమారు కోటికి పైగా ఉంటాయని ప్రకటించింది.ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల ఆస్తులు కనీసంగా రూ. 1.99 కోట్లుగా ఉంటుందని ఏడీఆర్ ప్రకటించింది.

రాష్ట్రంలోని మోకామా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆర్జేడీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న అనంత్ కుమార్  సింగ్  తొలి విడత బరిలో నిలిచిన అభ్యర్ధుల్లో అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. ఆయన ఆస్తుల విలువ రూ. 68 కోట్లు ఉంటుందని అంచనా. 2015 ఎన్నికల్లో అనంత్ కుమార్ సింగ్ ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. ఈ దఫా ఆయన ఆర్జేడీ అభ్యర్ధిగా బరిలో దిగాడు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి గజానంద్ సాహీ షేక్‌పుర నుండి బరిలో దిగాడు. ఆయన ఆస్తుల విలువ రూ. 61 కోట్లు ఉన్నట్టుగా అంచనా వేసింది. గయ అసెంబ్లీ స్థానంనుండి బరిలో జేడీ(యూ) అభ్యర్ధిగా బరిలో నిలిచిన మనోరమ దేవి రూ. 50 కోట్లు ఉన్నట్టుగా ఏడీఆర్ తెలిపింది.ఈ విడతలో బరిలో ఉన్న అభ్యర్ధుల్లో కేవలం ఐదుగురికి మాత్రం ఎలాంటి ఆస్తులు లేవని ప్రకటించారు. 

తొలి విడతలో బరిలో ఉన్న 1064 మందిలో 328పై క్రిమినల్ కేసులున్నాయి. 31 శాతం అభ్యర్ధులు తమపై కేసులు ఉన్నట్టుగా ప్రకటించారు. 244 మందిపై సీరియస్ క్రిమినల్ కేసులున్నట్టుగా ప్రకటించారని ఏడీఆర్ తెలిపింది.