Asianet News TeluguAsianet News Telugu

vice president election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జగదీప్ ధన్‌కర్ ఘన విజయం

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే పక్షాల అభ్యర్ధి జగదీప్ ధన్‌కర్ విజయం సాధించారు. ఇవాళ జరిగిన ఓట్ల లెక్కింపులో జగదీప్‌కు 528 ఓట్లు, మార్గరెట్ ఆళ్వాకు 182 ఓట్లు పోలయ్యాయి.

NDA Candidate Jagdeep Dhankhar wins vice-presidential election
Author
New Delhi, First Published Aug 6, 2022, 8:01 PM IST

ఇకపోతే.. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు (vice presidential election) సంబంధించి ఎన్డీయే (nda) పక్షాల అభ్యర్ధిగా ప్రస్తుత బెంగాల్ గవర్నర్ (west bengal governor) జగదీప్ ధన్‌కర్‌ను (jagdeep dhankhar) బీజేపీ (bjp) ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఉప రాష్ట్రపతి అభ్యర్ధుల రేసులో హేమాహేమీల పేర్లు వినిపించినప్పటికీ.. వారందరినీ పక్కనబెట్టి కమలనాథులు జగదీప్‌వైపే మొగ్గుచూపారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆయన అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసింది. 

ఇది జగదీప్ ధన్‌కర్ ప్రస్థానం: 

జగదీప్ ధన్‌కర్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారు. 1951 మే 18న జున్‌జున్ జిల్లా కితానా గ్రామంలో గోఖల్ చంద్, కేసరి దేవి దంపతులకు ఆయన జన్మించారు. చిత్తోర్‌ఘడ్‌లోని సైనిక్ స్కూల్‌లో ధన్‌కర్ పాఠశాల విద్యను పూర్తి చేశారు. అనంతరం భౌతిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన ఆయన.. యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ నుంచి ఎల్ఎల్‌బీ అందుకున్నారు. అనతి కాలంలోనే రాజస్థాన్‌లో ప్రముఖ లాయర్లలో ఒకరిగా జగదీప్ గుర్తింపు తెచ్చుకున్నారు. రాజస్థాన్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో పలు కీలక కేసుల్లో ఆయన వాదనలు వినిపించారు. 

ALso REad:Vice President election: ఎన్డీయే పక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా ఛాన్స్.. ఎవరీ జగదీప్ ధన్‌కర్..?

అనంతరం రాజకీయాలపై ఆసక్తితో 1989లో జనతాదళ్ తరపున లోక్‌సభ ఎన్నికల్లో జున్‌జున్ నుంచి విజయం సాధించారు. 1989 నుంచి 1991 వరకు కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించిన ధన్‌కర్ 1993- 98 మధ్య అజ్మీర్ జిల్లాలోని కిషన్ గడ్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 జులైలో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం ఆయనను నియమించింది. తనదైన శైలిలో పనిచేస్తున్న ధన్‌కర్‌ను బెంగాల్ వాసులు ‘‘పీపుల్స్ గవర్నర్’’గా పిలుచుకుంటారు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఎంపికైన జగదీప్ కు పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios