Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు: మోడీ సహా పలువురు మంత్రులు హాజరు


రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ము శుక్రవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు ఆమె నామినేషన్ పత్రాలను అందించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా తో పాటు పలువురు  మంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన ఎంపీలుు ముర్ము నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆమె వెంట ఉన్నారు.

NDA candidate Draupadi Murmu files nomination for Presidential election
Author
New Delhi, First Published Jun 24, 2022, 12:46 PM IST

న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవికి NDA  అభ్యర్ధి ద్రౌపది ముర్ము శుక్రవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు Draupadi Murmu తన నామినేషన్ పత్రాలు అందించారు.

 

 పార్లమెంట్ ఆవరణలో ద్రౌపది ముర్ము  Gandhi విగ్రహం వద్ద  నివాళులర్పించారు.  అనంతరం ఆమె రాజ్యసభ సెక్రటరీ కార్యాలయంలో Nomination పత్రాలు అందించారు.రాష్ట్రపతి అభ్యర్ధి ముర్ము వెంట  ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా తో పాటు ఎన్డీఏ కూటమి పక్షాలున్నాయి.ముర్ము నామినేషన్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించారు.

సీనియర్ కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. రాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేయడానికి ఒడిశా నుండి ద్రౌపది ముర్ము గురువారం నాడు భువనేశ్వర్ నుండి ఢిల్లీకి చేరుకున్నారు.  నిన్ననే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతో ఆమె సమావేశమయ్యారు. ముర్మును ఎన్డీఏ రాష్ట్రపతి పదవికి అభ్యర్ధిగా ప్రకటించడంతో నితీష్ కుమార్ కు చెందిన జనతాదళ్ (యునైటెడ్) ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో మద్దతును తెలిపింది.

ఏపీ సీఎం వైఎస్ నేతృత్వంలోని వైసీపీ కూడా ముర్ము అభ్యర్ధిత్వానికి మద్దతును ప్రకటించింది. జార్ఖండ్ లో కాంగ్రెస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్న జేఎంఎం కూడా ముర్ము అభ్యర్ధిత్వానికి మద్దతు పలికే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 25వ తేదీ నుండి ముర్ము తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ విషయమై అన్ని పార్టీలను తనకు మద్దతివ్వాలని కోరనున్నారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఎన్సీపీ చీఫ్ శదర్ పవార్ లకు కూడా ముర్ము ఫోన్ చేసి తనకు మద్దతివ్వాలని కోరారని జాతీయ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios