తనను చూసి రాజకీయాల్లోకి వచ్చానంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. దీని వల్ల తాను ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందో తెలియదని.. అలాగే ఈ వయసులో తాను ఇక ఎలాంటి బాధ్యతలు చేపట్టకూదని నిర్ణయించుకున్నట్లు శరద్ పవార్ పేర్కొన్నారు.

తనను చూసి రాజకీయాల్లోకి వచ్చానంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. మీడియా సమావేశంలో భాగంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు పవార్ మాట్లాడుతూ.. దీని వల్ల తాను ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందో తెలియదన్నారు. అలాగే ఈ వయసులో తాను ఇక ఎలాంటి బాధ్యతలు చేపట్టకూదని నిర్ణయించుకున్నట్లు శరద్ పవార్ పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల తరపున ప్రధాని రేసులో తాను లేనని ఆయన స్పష్టం చేశారు. 

కానీ బీజేపీకి వ్యతిరేకంగా ...బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు మాత్రం తాను సాయం చేస్తానని పవార్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అధికారంలో వున్న రాష్ట్రాలలో సీబీఐ, ఈడీ, ఐటీలను కేంద్రం దించుతోందని ఆయన ఆరోపించారు. ఇందుకు ‘మహారాష్ట్ర’ నే అందుకు ఉదాహరణ అని పవార్ పేర్కొన్నారు. బీజేపీ దాడి ప్రజాస్వామ్యంలో తీవ్ర ఆందోళన కలిగించే అంశమని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. 

ALso REad:Sharad Pawar: ఆ పార్టీ ప్రాంతీయ పార్టీల‌ను అంతం చేస్తోంది.. శ‌ర‌ద్ ప‌వార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఇకపోతే.. మ‌హారాష్ట్ర రాజ‌కీయాల కాక‌రేపుతూనే ఉన్నాయి. రెబ‌ల్ ఎమ్మెల్యేల తిరుగుబాటు కార‌ణంగా శివ‌సేన‌, కాంగ్రెస్‌, ఎన్సీపీల సంకీర్ణ ప్ర‌భుత్వం కుప్ప‌కూలింది. ఈ క్ర‌మంలోనే బీజేపీ-శివ‌సేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు క‌లిసి మ‌హారాష్ట్రలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనూహ్యంగా శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేల నాయ‌కుడు ఏక్‌నాథ్ షిండే ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టారు. ప్లోర్ టెస్ట్ లో కూడా షిండే విజ‌యం సాధించారు. 

ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం మ‌హారాష్ట్రలో ఏర్పాటైన బీజేపీ-శివ‌సేన రెబ‌ల్ ప్ర‌భుత్వంపై ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వచ్చే ఆరు నెలల్లో శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉన్నందున మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అసెంబ్లీలో బ‌ల ప‌రీక్షలకు ముందు ఎన్సీపీ శాసనసభ్యులు, పార్టీ ఇతర నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. "మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వచ్చే ఆరు నెలల్లో పడిపోవచ్చు, కాబట్టి మధ్యంతర ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి" అని సమావేశానికి హాజరైన ఎన్సీపీ నాయ‌కుడు శ‌ర‌ద్‌ప‌వార్ చెప్పిన‌ట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. "షిండేకు మద్దతు ఇస్తున్న చాలా మంది తిరుగుబాటు శాసనసభ్యులు ప్రస్తుత ఏర్పాటుతో సంతోషంగా లేరని పవార్ అన్నారు. మంత్రిత్వ శాఖలు పంపిణీ చేయబడిన తర్వాత, వారి అశాంతి బయటపడుతుందని, ఇది చివరికి ప్రభుత్వ పతనానికి దారి తీస్తుంది" అని శ‌ర‌ద్ ప‌వార్ పేర్కొన్నారు.