Asianet News TeluguAsianet News Telugu

ఎన్సీఆర్టీ సంచలన నిర్ణయం .. ఖలిస్తాన్ పాఠ్యాంశం తొలగింపు.. 

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది.  12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకం నుండి ఖలిస్తాన్ అనే పదాన్ని తొలగించింది.

NCERT omits Khalistan references from Class 12 textbook after Sikh body's objection krj
Author
First Published May 30, 2023, 11:06 PM IST

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. 12వ తరగతి పాఠ్యపుస్తకం నుంచి ప్రత్యేక సిక్కు దేశం లేదా ఖలిస్తాన్  అనే పాఠ్యాంశాన్ని పూర్తిగా తొలగించింది. గత నెలలో ఎన్సీఆర్టీ 12వ తరగతిలోని పొలిటికల్ సైన్స్ పాఠ్యాంశంపై సిక్కుల అత్యున్నత సంస్థ ‘‘శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (SGPC)’’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

సిక్కుల చారిత్రక సమాచారాన్ని తప్పుగా సూచించిందని SGPC ఆరోపించింది. 'భారతదేశంలో రాజకీయాలు' అనే పుస్తకంలో ఆనంద్‌పూర్ సాహిబ్ తీర్మానం ప్రస్తావన ఉండటంపై SGPC అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై వచ్చిన ఫిర్యాదులపై నిపుణుల కమిటీ వేశామని, కమిటీ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా NCERT నిర్ణయం తీసుకున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

ఏ పాఠ్యాంశం తొలగించబడింది?

పంజాబ్ కు సంబంధించిన పాఠ్యాంశంలో సిక్కుల ప్రత్యేక దేశం ఖలిస్తాన్ డిమాండ్ అనే వ్యాఖ్యాలను విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు తొలగించారు. నాలుగో పేరా నుంచి ఖలిస్తాన్ అనే అంశాన్ని పూర్తిగా తొలగించారు. మార్పులతో కూడిన 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకాల సాఫ్ట్ కాపీని NCERT తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. 

విద్యా మంత్రిత్వ శాఖలోని స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ ప్రకారం.. “శ్రీ ఆనంద్‌పూర్ సాహిబ్ తీర్మానాన్ని తప్పుగా సూచించడం, సిక్కు సమాజానికి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన విషయాలను ఉపసంహరించుకోవడంపై SGPC నుండి మెమోరాండం అందింది. సమస్యను పరిశీలించేందుకు ఎన్‌సీఈఆర్‌టీ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, దాని సిఫార్సుల ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు.అని తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ..  “NCERT ఒక కొరిజెండమ్‌ను జారీ చేసింది. కొత్త అకడమిక్ సెషన్ కోసం పుస్తకాలు భౌతికంగా ముద్రించబడ్డాయి. డిజిటల్ పుస్తకాలు మార్పు చేయబడ్డాయని తెలిపారు. సిక్కుల మనోభావాలు దెబ్బతీసేవిగా ఉన్నాయని ఆయన అన్నారు

ఆనంద్‌పూర్ సాహిబ్ రిజల్యూషన్ 1973లో శిరోమణి అకాలీ దళ్ చేత ఆమోదించబడిన పత్రం. ఈ తీర్మానం సిక్కుమతం పట్ల పార్టీ నిబద్ధతను పునరుద్ఘాటించింది . పంజాబ్‌కు ఎక్కువ స్వయంప్రతిపత్తి కల్పించాలని పిలుపునిచ్చింది. చండీగఢ్‌ నగరాన్ని పంజాబ్‌కు అప్పగించాలని, పొరుగు రాష్ట్రాల్లో పంజాబీకి ద్వితీయ భాష హోదా కల్పించాలని డిమాండ్‌ చేసింది. ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాల నుండి అనేక అంశాలు , భాగాలను తొలగించడం గత నెలలో వివాదానికి దారితీసింది, కేంద్రం "పగతీర్చుకునేందుకు ఈ విషయాలను కప్పిపుచ్చుతోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios