Asianet News TeluguAsianet News Telugu

నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం సక్సెస్: వీడియో విడుదల చేసిన నేవీ

ఇండియన్ నేవీ నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా  చేపట్టింది. ఈ మేరకు భారత నావికాదశం శుక్రవారం నాడు ఓ కీలక వీడియోను విడుదల చేసింది.  అరేబియా సముద్రంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. 

Navy demonstrates combat readiness; releases video of missiile hitting target lns
Author
New Delhi, First Published Oct 23, 2020, 3:35 PM IST

న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా  చేపట్టింది. ఈ మేరకు భారత నావికాదశం శుక్రవారం నాడు ఓ కీలక వీడియోను విడుదల చేసింది.  అరేబియా సముద్రంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. 

also read:భారత అమ్ముల పొదిలో నాగాస్త్రం: 'నాగ్ 'క్షిపణి ప్రయోగం సక్సెస్

నిర్ధేశిత లక్ష్యాన్ని ఈ క్షిపణి చేధించినట్టుగా ఇండియన్ నేవీ తెలిపింది.  క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని కచ్చితత్వంతో చేరుకొందని నేవీ ప్రతినిధి  తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

 

చీఫ్ నావల్ స్టాప్ ఆడ్మిరల్ కరంబీర్ సింగ్ గురువారం నాడు సముద్రం వద్ద ఉన్న వివిధ తీర ఆధారిత ప్రదేశాలలో తన శక్తి కార్యాచరణను సమీక్షించారు. 

ఇండియా, చైనా సరిహద్దుల్లో గత కొన్ని నెలలుగా ఉద్రిక్తతలు చోటు చేసుకొన్నాయి.  దీంతో ఇండియన్ నేవీ పీక్ కంబాట్ రెడీనెస్ కార్యకలాపాలను నిరంతరం కొనసాగించినందుకు ఆయన నేవీ అధికారులను అభినందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios