Asianet News TeluguAsianet News Telugu

Narendra Modi:మీ దగ్గర ట్రాక్టరుంది, నాకు సైకిల్ కూడ లేదు: జమ్మూ మహిళలతో మోడీ సంభాషణ

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని  రంగ్ పూర్ గ్రామ సర్పంచ్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా మాట్లాడారు. 

  Narendra Modi:You have a tractor I do not even have a bicycle says PM lns
Author
First Published Nov 30, 2023, 3:00 PM IST

న్యూఢిల్లీ: విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్దిదారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం నాడు వర్చువల్ గా సంభాషించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని జమ్మూ జిల్లా రంగ్ పూర్ గ్రామ సర్పంచ్, మహిళా రైతు బల్ వీర్ కౌర్ తో ప్రధాన మంత్రి మాట్లాడారు.

ఏ పథకాలతో తో ప్రయోజనం పొందారని  మహిళా రైతు బల్వీర్ ను  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించారు.  దీనిపై  కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్, ఫార్మ్ మెషీనరీ బ్యాంక్ స్కీమ్, కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ వంటి ప్రభుత్వ పథకాలను తాను సద్వినియోగం చేసుకున్నట్టుగా  మహిళా రైతు బల్విర్ ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు.

బల్విర్ ముందు  కుర్చిలో కూర్చుని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడుతున్నారు.  అయితే ఆ పక్కనే మరో స్త్రీ కూర్చొని ఉంది.  ఈ సంభాషణ సాగుతున్న సమయంలోనే  బల్వీర్ పక్కనే కూర్చున్న మహిళకు కాస్త స్థలం ఇవ్వాలని కోరింది.  సర్పంచ్ కూర్చున్న సీటింగ్ వరుసలో  ఎవరో ఆమెను ముందుకు నెట్టడంతో  కొత్త హక్కుదారులు ముందుకు వస్తున్నందున ఆమె కుర్చీని గుర్తుంచుకోవాలని ప్రధాని మోడీ చమత్కరించారు.

నీ పక్కనే మరో నాయకుడు వచ్చాడు... అందరిని తొలగించి ఇప్పుడే సర్పంచ్ అవుతారని అనిపిస్తుందని బల్వీర్ తో ప్రధాని నవ్వుతూ వ్యాఖ్యానించారు.తాను కేసీసీ సహాయంతో ట్రాక్టర్ ను  కొన్నానని  దీని తర్వాత ఇతర పథకాల నుండి ప్రయోజనాలను పొందిన విషయాన్ని బల్వీర్ చెప్పారు.  మీరు ఎంత గొప్ప వ్యక్తో  చూడండి... నా వద్ద సైకిల్ కూడ లేదు. మీరు ట్రాక్టర్ కు యజమాని అయ్యారని  మోడీ చెప్పారు. ఈ విషయమై బల్వీర్ స్పందించారు. సార్.. ఇది మీ ఆశీర్వాదమేనన్నారు.  తాను ఇంతకు ముందులా లేనని చెప్పారు.  తన పేరున ఉన్న పెద్ద వాహనం ట్రాక్టర్ అని బల్వీర్ చెప్పారు.ఇది తనకు పెద్ద విషయంగా ఆమె పేర్కొన్నారు.

also read:Narendra Modi:విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్దిదారులతో మోడీ సంభాషణ

ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందరికీ అందాలని మోడీ  కోరారు.  చుట్టుపక్కల పది గ్రామాలకు  చేరుకొని ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేయాలని బల్వీర్ కు మోడీ సూచించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios