Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ లో కుప్పకూలిన మోర్బి బ్రిడ్జి: ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మోడీ

మోర్బి  వంతెన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ సోమవారంనాడు సమీక్ష నిర్వహించారు.ఈ ఘటనకు సంబంధించి  బాధితులకు సహాయం  త్వరగా అందించేలా చర్యలు  తీసుకోవాలిన  పీఎంను కోరారు.
 

Narendra Modi Conducts High level meeting On  Morbi Bridge Collapse
Author
First Published Oct 31, 2022, 9:12 PM IST

గాంధీనగర్: మోర్బీ వంతెన ప్రమాదంపై  ప్రధాని నరేంద్రమోడీ సోమవారం నాడు గాంధీనగర్ లోని  రాజ్  భవన్ లో సమీక్ష నిర్వహించారు.ఈ  ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు  సహయంతో  పాటు క్షతగాత్రులకు  సహాయం  త్వరగా అందేలా  చూడాలని ప్రధాని మోడీ ఆదేశించారు.

మోర్బిలో ప్రమాదం  గురించి  అధికారులు  వెంటనే ప్రధానికి తెలిపారు.. ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్స్ తీరుతెన్నులను కూడా  వివరించారు.దుర్ఘటనకు గల కారణాలపై ప్రధాని ఆరా  తీశారు. బాధితులకు  అన్ని విధాలా సహాయం  అందించాలని  ప్రధాని కోరారు.

also read:గుజరాత్‌లో కుప్పకూలిన మోర్బి బ్రిడ్జి: ఒరెవా సంస్థకు చెందిన ఇద్దరు అరెస్ట్

మోర్బి బ్రిడ్జి కూలిన ఘటనలో 141 మంది  మృతి చెందిన విషయం తెలిసిందే. వంతెన ప్రమాదానికి  గల  కారణాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ  ఘటనలో మృతి  చెందిన వారిలో వృద్దులు, పిల్లలు ఎక్కువగా ఉన్నారు. బ్రిడ్జి  కూలిన ఘటనపై పోలీసులు దర్యాప్తును  నిర్వహిస్తున్నారు.బ్రిడ్జిపై కెపాసిటీ  మించి  జనం రావడంతో ప్రమాదానికి కారణమైందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ బ్రిడ్జికి ఇటీవలనే  మరమ్మత్తులు నిర్వహించారు. రూ.2 కోట్లతో ఒరెవా సంస్థ మరమ్మత్తులు నిర్వహించింది. మరమ్మత్తులు పూర్తైన తర్వాత  ఐదు రోజుల క్రితమే పర్యాటకులను అనుమతి  ఇచ్చారు.ఐదు రోజుల  తర్వాత ఈ  బ్రిడ్జి కూలిపోవడంతో 141 మంది మృతి  చెందారు. ఈ ఘటనకు సంబంధించి ఒరెవా సంస్థకు చెందిన ఇద్దరిని  పోలీసులు అరెస్ట్  చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios