Asianet News TeluguAsianet News Telugu

అండమాన్‌ దీవుల పేర్లు పాపులారిటీ కోసం మాత్రమే.. నేతాజీ ప్రణాళికా సంఘాన్ని కేంద్రం ర‌ద్దు చేసింది: మమతా బెనర్జీ

Kolkata: భార‌త స్వాతంత్య్ర స‌మ‌రయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని పురస్కరించుకుని నేతాజీ ద్వీపంలో నిర్మించబోయే జాతీయ స్మారకం మోడల్ ను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. దీనిపై బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ స్పందిస్తూ.. అండమాన్‌లోని దీవులకు పేరు పెట్ట‌డం కేవ‌లం పాపులారిటీ కోసం మాత్రమేన‌ని విమ‌ర్శించారు. అలాగే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ రూపొందించిన ప్రణాళికా సంఘాన్ని కేంద్రం రద్దు చేసిందని మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోపించారు.
 

Names of Andaman Islands are only for popularity.. Center canceled Netaji Planning Commission: Mamata Banerjee
Author
First Published Jan 23, 2023, 4:25 PM IST

West Bengal Chief Minister Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. మమతా బెనర్జీ తన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వంపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుపడ్డారు. "ఏజెన్సీలకు భయపడి పారిపోయే వారు చాలా మంది ఉన్నారు, మేము అలా చేయము.. మీకు చేతనైనంత చేయండి.. మా వద్ద ఉన్నదంతా తీసుకోండి కాని దేశాన్ని అమ్మవద్దు. ఏజెన్సీలను మన వెంట పెట్టండి కానీ దేశం సమైక్యంగా ఉండనివ్వండి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అంటే ప్రజల హక్కులను ఉల్లంఘించడమేనంటూ కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. 

భార‌త స్వాతంత్య్ర స‌మ‌రయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని పురస్కరించుకుని నేతాజీ ద్వీపంలో నిర్మించబోయే జాతీయ స్మారకం మోడల్ ను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. దీనిపై బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ స్పందిస్తూ.. అండమాన్‌లోని దీవులకు పేరు పెట్ట‌డం కేవ‌లం పాపులారిటీ కోసం మాత్రమేన‌ని విమ‌ర్శించారు. అలాగే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ రూపొందించిన ప్రణాళికా సంఘాన్ని కేంద్రం రద్దు చేసిందని మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోపించారు. అండమాన్ నికోబార్ దీవులను 1943లో సందర్శించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గుర్తిచేసిన ఆమె.. ఈ దీవులకు 'షాహిద్', 'స్వరాజ్' ద్వీప్ అని నామకరణం చేశారని పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు కేవలం పాపులారిటీ కోసం ఈ ద్వీపాలకు ప్ర‌ధాని మోడీ పేర్లు పెట్టారని కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై మమతా బెనర్జీ విమ‌ర్శ‌లు గుప్పించారు. 

అలాగే, భార‌త స్వాతంత్య్ర‌ సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ రూపొందించిన ప్రణాళికా సంఘాన్ని కేంద్రం రద్దు చేసిందని మ‌మ‌త ఆరోపించారు. అండమాన్ లోని నీల్, హావ్లాక్ దీవులకు 2018లో కేంద్రం 'షాహిద్' ద్వీప్, 'స్వరాజ్' ద్వీపంగా నామకరణం చేసింది. స్వాతంత్ర్య సమరయోధుడి గౌరవార్థం రాస్ ద్వీపానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని నామకరణం చేశారు.  

నేతాజీ బోస్ 126వ జయంతి సందర్భంగా కేంద్ర పాలిత ప్రాంతంలోని 21 ద్వీపాలకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెట్టిన కొన్ని గంటల తర్వాత మ‌మ‌తా బెన‌ర్జీ ఈ వ్యాఖ్య‌లు చేశారు. "ఈ రోజు కేవలం ప్రజాదరణ పొందడం కోసం, కొందరు అండమాన్ దీవులకు షాహిద్, స్వరాజ్ ద్వీప్ పేర్లు పెట్టారని చెప్పుకుంటున్నారు, అయితే సెల్యులార్ జైలును తనిఖీ చేయడానికి బోస్ అక్కడికి వెళ్ళినప్పుడు ఈ దీవులకు అలాంటి పేర్లను పెట్టారు" అని బెనర్జీ చెప్పారు. నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి ప్రసంగించారు. మమతా బెనర్జీతో పాటు పలువురు ప్రముఖులు, బోస్ కుటుంబ సభ్యులు రెడ్ రోడ్ కార్యక్రమంలో నేతాజీకి  నివాళులు అర్పించారు.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios