నాగాల్యాండ్ మంత్రి తెంజెన్ ఇమ్నా అలాంగ్ వైఫ్ గురించి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాను కూడా భార్య  కోసం ఎదురుచూస్తున్నా అని చేసిన కామెంట్‌కు షాదీ డాట్ కామ్ ఫౌండర్ రియాక్ట్ అయ్యాడు. తాను సహాయం చేయాల్సిందేనని పేర్కొన్నాడు. 

న్యూఢిల్లీ: నాగాల్యాండ్ మంత్రి తెంజెన్ ఇమ్నా అలాంగ్ తన హాస్యభరిత సంభాషణలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఆయన వ్యాఖ్యలు విశేష ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇటీవలే ఆయన ప్రపంచ జనాభా దినోత్సవం నాడు తనలా సింగిల్స్ గ్రూప్‌లో చేరండి అంటూ చేసిన కామెంట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆయన గూగుల్ సెర్చ్ బాక్స్‌ సజేషన్‌లో తెంజెన్ ఇమ్నా అలాంగ్ వైఫ్ అనే దాన్ని హైలైట్ చేస్తూ ట్వీట్ చేశారు.

ఈ పిక్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసి.. ‘గూగుల్.. ఈ సజేషన్ చూసి నేను కూడా ఎగ్జయిట్ అవుతున్నా. ఆమె కోసం నేను ఇంకా ఎదురుచూస్తున్నాను!’ అంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్ నెటిజన్ల కంట పడింది. షాదీ డాట్ కామ్ ఫౌండర్ అనుపమ్ మిత్తల్ ఈ కామెంట్‌పై రియాక్ట్ అయ్యాడు. మంత్రి తెంజెన్ ఇమ్నా అలాంగ్‌కు తాను సహాయం చేయాల్సి ఉన్నదని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు ఇమ్నా ఏ మాత్రం సమయం వృథా చేయకుండా రిప్లై ఇచ్చాడు.

Scroll to load tweet…

‘భాయ్.. ఇప్పుడు నేను బిందాస్‌గా ఉన్నాను. ముందు సల్మాన్ భాయ్ కోసం వెయిట్ చేస్తున్నా’ అని వివరించారు. ఇంతటితో వారి సంభాషణ ముగిసిపోలేదు. సల్మాన్ భాయ్ పెళ్లి కోసం ఎదురుచూడటమంటే.. ఎక్కువ సమయమే అవుతుందని అనుపమ్ మిత్తల్ కామెంట్ చేశాడు. అయితే, మంత్రి కోసం తాను, తన షాదీ డాట్ కామ్ ఎదురుచూస్తుందని పేర్కొన్నాడు. ఈ కామెంట్‌పై షాదీ డాట్ కామ్ అఫీషియల్ హ్యాండిల్ కూడా రెస్పాండ్ అయింది. తాము అలాంగ్ ఇమ్నా కోసం ఎదురుచూస్తామని ట్వీట్ చేసింది.

Scroll to load tweet…

వరల్డ్ పాపులేషన్ డే రోజున ఇమ్నా తన వ్యక్తిగత సమాచారాన్ని ఫన్నీగా బయటపెట్టారు. జనాభా వృద్ధి పట్ల అవగాహనతో ఉండాలని, సరైన నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. లేదంటే తనలా సింగిల్‌గా ఉండిపోవాలని వివరించారు. తద్వార సుస్థిర భవితకు దోహదపడాలని తెలిపారు. సింగిల్స్ ఉద్యమంలో నేడే చేరండి అంటూ కామెంట్ చేశారు.

Scroll to load tweet…

ఈ కామెంట్‌పై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా స్పందించారు. నాగాల్యాండ్ విద్యా శాఖ మంత్రి అలాంగ్ ఇమ్నా.. పెళ్లికి వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చారు. కానీ, ఆయన గ్రూపులో సభ్యులను పెంచుకోవాలనేదే ఆయన ఉద్దేశం అని వివరించారు. దీనికి మళ్లీ రెస్పాండ్ అవుతూ అవును కిరణ్ రిజిజిగారు అని అలాంగ్ ఇమ్నా ట్వీట్ చేశారు. ఎక్కువ సంఖ్యలో ప్రజలు తన గ్రరూపులో చేరినా తాను గాబరా పడను అని వివరించారు.