నాగాలాండ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని స్థానాలకు సంబంధించిన ఫలితాలు కూడా వెలువుడుతున్నాయి. ఇప్పటి వరకు అధికార ఎన్‌డీపీపీ-బీజేపీ కూటమి 5 స్థానాలు గెలుచుకుంది. 


నాగాలాండ్ శాసనసభలోని మొత్తం 60 నియోజకవర్గాలలోని 59 స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. గురువారం ఉదయం ఓట్ల లెక్కింప్ర ప్రారంభమైంది. భారత ఎన్నికల సంఘం ప్రకారం నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్‌డీపీపీ-బీజేపీ కూటమి ఇప్పటి వరకు ఐదు స్థానాల్లో (ఎన్‌డీపీపీ- మూడు బీజేపీ- రెండు) గెలుపొందింది. దాదాపు 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

జేఎన్‌యూలో కొత్త రూల్స్.. ధర్నా చేస్తే రూ. 20 వేల ఫైన్, హింసకు పాల్పడితే అడ్మిషన్ క్యాన్సిల్

60 స్థానాల్లో 55 స్థానాలకు ప్రస్తుతం వరకు అందుబాటులో ఉన్న ట్రెండ్స్ ప్రకారం 40:20 సీట్ల షేరింగ్ ఒప్పందంపై బీజేపీతో పొత్తుతో ఎన్నికల్లో పోరాడిన నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉందని ‘జీ న్యూస్’ నివేదించింది. అలాగే బీజేపీ ప్రస్తుతం 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) కూడా రెండు సీట్లను గెలుచుకుంది. ఎన్‌డీపీపీ అధినేత, నాగాలాండ్ సీఎం నీఫియు రియో ​​తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి సెయివిలీ సచుపై 6,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు.

కర్నాటక హోంమంత్రి కాన్వాయ్‌ పోలీసు కారు ఢీ కొని బైకర్ మృతి.. మంత్రి ఏమన్నారంటే...

కాగా.. ఎన్‌డీపీపీకి చెందిన హెకానీ జఖాలు నాగాలాండ్ అసెంబ్లీలో మొదటి మహిళా ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి అయిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అభ్యర్థి అజెటో జిమోమిని డిమాపూర్-3 స్థానంలో 1,536 ఓట్ల తేడాతో ఓడించారు.