ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ యాజమాన్యం కొత్త రూల్స్ తెచ్చింది. విద్యార్థులు ధర్నాలు చేస్తే వారిపై రూ. 20 వేల జరిమానా పడనుంది. క్యాంపస్‌లో హింసకు తెగబడితే వారి అడ్మిషన్ రద్దు చేసే ముప్పు కూడా ఉంటుంది.
న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ కొత్త రూల్స్ తెచ్చింది. ఒక పై విద్యార్థులు ధర్నాలు చేస్తే వారిపై రూ. 20 వేల జరిమానా విధిస్తుంది. వర్సిటీ క్యాంపస్‌లో హింసకు పాల్పడితే వారి అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తుంది. ఈ నిబంధనలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. నిరసనలు, ఫోర్జరీ వంటి వివిధ రకాల చర్యలకు విధించే శిక్షల(పనిష్మెంట్లు) గురించి పది పేజీల్లో పేర్కొంది. బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ సందర్భంలో యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రదర్శనలు జరిగాయి. ఈ ఆందోళనల నేపథ్యంలోనే కొత్త రూల్స్‌ను యూనివర్సిటీ తేవడం గమనార్హం.
ఈ రూల్స్ పత్రాలను వర్సిటీ అత్యున్న నిర్ణయ కమిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది. ఈ డాక్యుమెంట్‌ను కోర్టు మ్యాటర్‌ల కోసం రూపొందించినట్టు ఈసీ సభ్యులు పీటీఐకి తెలిపారు.
ఈ రూల్స్ పై ఏబీవీపీ స్పందించింది. కొత్త రూల్స్ తుగ్లఖీ తరహా ఉన్నాయని ఏబీవీపీ జేఎన్‌యూ సెక్రెటరీ వికాస్ పటేల్ అన్నారు. పాత కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్ని రకాల పరిస్థితులకు సరిపోతుందని అభిప్రాయపడ్డారు. ఈ డ్రకోనియన్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, దీనిపై జేఎన్‌యూ వీసీ శాంతిశ్రీ డీ పండిత్ స్పందన కోరే ప్రయత్నం చేసినా సాధ్యం కచాలేదు.
Also Read: కొన్ని అంశాల్లో ప్రపంచ పాలన విఫలమైంది - జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో ప్రధాని మోడీ
ఈ రూల్స్ యూనివర్సిటీ విద్యార్థులు, పార్ట్ టైమై్ విద్యార్థులు సహా అందరికీ వర్తిస్తాయి. ఈ పనిష్మెంట్లు మొత్తం 17 రకాల ‘నేరాల’ గురించి వివరించింది. అందులో గ్యాంబ్లింగ్, హాస్టల్ గదుల్లో అక్రమంగా అనుమతుల్లేకుండా ఉండటం, అసభ్యకర, అభ్యంతరకర భాష, ఫోర్జరీకి పాల్పడటం వంటి చర్యలను పేర్కొంది. ఈ రూల్స్ డాక్యుమెంట్ నకళ్లను విద్యార్థుల తల్లిదండ్రులకు పంపించనున్నట్టు ఆ డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు.
