Asianet News TeluguAsianet News Telugu

నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ

మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఆ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను గురువారం విడుదల చేసింది. 

Nagaland and Meghalaya assembly elections.. BJP has released the first list of candidates
Author
First Published Feb 2, 2023, 2:11 PM IST

నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ గురువారం విడుదల చేసింది. నాగాలాండ్ కోసం ఈ మొదటి జాబితాలో 20 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్‌టాకీ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారని అందులో పేర్కొంది. 

సుప్రీంకోర్టుపై వ్యాఖ్యలు చేసిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి, ఉపరాష్ట్రపతిపై కేసు.. ‘వారి బాధ్యతల నుంచి తప్పుకోవాలి

ఈ జాబితాను బీజేపీ సీనియర్ నేతలు గురువారం విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘‘నాగాలాండ్‌లోని 60 స్థానాలకు 20 స్థానాల్లో పోటీ చేస్తాం. మిగిలిన సీట్లు మా కూటమి భాగస్వామ్య ఎన్‌డీపీపీకి వదిలేస్తున్నాం’’ అని తెలిపారు. కాగా.. రాబోయే మేఘాలయ శాసనసభ ఎన్నికలకు 60 మంది అభ్యర్థుల జాబితాను కూడా కాషాయ పార్టీ ప్రకటించింది.‘‘మేఘాలయలో మొత్తం 60 స్థానాల్లో పోటీ చేస్తాం. మా ట్యాగ్‌లైన్ ‘ఎం పవర్ మేఘాలయ’. అంటే మోడీ నేతృత్వంలోని మేఘాలయ అని అర్థం. ఇక్కడ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడుతుంది ” అని బీజేపీ నాయకులు తెలిపారు.

నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 27న ఒకే దశలో జరగనున్నాయి. మార్చి 2వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. భారత ఎన్నికల సంఘం ప్రకారం.. నాగాలాండ్, మేఘాలయ పదవీకాలం వరుసగా మార్చి 12, 15వ తేదీన ముగియనున్నాయి. కాగా.. త్రిపుర అసెంబ్లీకి కూడా ఫిబ్రవరి 16వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ రాష్ట్రంలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు బీజేపీ దేశ రాజధానిలో సీఈసీ సమావేశాన్ని నిర్వహించింది.

జల్లికట్టు అనుమతులపై రచ్చ.. హైవే దిగ్బంధనం, పోలీసు వాహనాలపై రాళ్ల దాడి.. తీవ్ర ఉద్రిక్తత

ఈ సమావేశం తరువాత త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు 48 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను బీజేపీ ప్రకటించింది. ధన్‌పూర్ నుంచి కేంద్ర మంత్రి ప్రతిమా భూమిక్‌ను పోటీకి దింపింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆరుగురికి టిక్కెట్లు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా టౌన్ బోర్దోవాలి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా 11 మంది మహిళా అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించారు. త్రిపురలో ఫిబ్రవరి 16న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయినప్పటికీ నాగాలాండ్, మేఘాలయతో పాటు మార్చి 2వ తేదీనే ఓట్ల లెక్కింపు జరగనుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios