Asianet News TeluguAsianet News Telugu

వింత వ్యాధి.. స్కూల్‌కెళ్తే చిన్నారుల అసాధారణ ప్రవర్తన.. ఇంటివద్ద అంతా ఓకే.. దెయ్యాలే అంటున్న గ్రామస్తులు

మధ్యప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ స్కూల్‌లో విద్యార్థినులు వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇంటి వద్ద మాత్రం చాలా నార్మల్‌గా బిహేవ్ చేస్తున్నారు. గత 15 రోజులుగా ఈ తీరు అబ్‌నార్మల్ బిహేవియర్ స్కూల్‌లో కనిపిస్తున్నది. కొంతమంది దెయ్యాలను స్కూల్‌కు పంపించారని గ్రామస్తులు చెబుతున్నారు.
 

mystery illness in madhya pradesh school, ghosts in school says villagers
Author
First Published Dec 18, 2022, 8:13 PM IST

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో షాహదోల్ జిల్లాలో ఓ విచిత్ర వ్యాధి కలకలం రేపుతున్నది. ఓ ప్రభుత్వ పాఠశాలలోని తొమ్మిది, పదో తరగతి విద్యార్థినులు స్కూల్‌కు వెళ్లితే అసాధారణంగా ప్రవర్తిస్తున్నారు. సగం అపస్మారక స్థితిలోకి వెళ్లుతున్నారు. ఇతరుల తల వెంట్రుకలు లాగి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. అదే ఇంటి వద్ద ఉంటే వారు చాలా నార్మల్‌గా ఉంటున్నారు. గత పదిహేను రోజులుగా ఈ అసాధారణ ఘటనలు ఆ స్కూల్‌లో జరుగుతున్నాయి. ఈ అంతుచిక్కని విధంపై గ్రామస్తులు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. దీనికి మంత్ర తంత్రాలే కారణం అని ఆపాదిస్తున్నారు. కొందరు దెయ్యాలను స్కూల్‌లోని పిల్లలపైకి తోలుతున్నారని వాదిస్తున్నారు. అధికారులు కూడా విద్యార్థుల అబ్‌నార్మల్ బిహేవియర్‌తో షాక్ అవుతున్నారు. సైంటిఫిక్ రీజన్స్‌ను గ్రామస్తులకు అర్థం చేయించడం కూడా క్లిష్టంగా మారింది. ఇది సైకలాజికల్ ఇష్యూ అని నిపుణులు చెబుతున్నారు. మాస్ హిస్టీరియాతో ఇలా జరుగుతున్నదని పేర్కొంటున్నారు.

జైత్వారా తెహసీల్‌లోని బిల్టికురి పంచాయతీలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ అంతుచిక్కని ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల తర్వాత సీనియర్ క్లాసులను మరో భవంతిలోకి స్కూల్ సిబ్బంది మార్చారు. సర్పంచ్ మాట్లాడుతూ, ఏడుగురి కంటే ఎక్కువ మంది విద్యార్థినులు ఇలా అసాధారణంగా వ్యవహరిస్తున్నారని వివరించారు. చాలా ఏళ్ల తర్వాత ఇలా జరుగుతున్నదని తెలిపారు. స్కూల్ ప్రారంభించినప్పుడు ఇలాంటివే జరిగాయని, కానీ, మతపరమైన క్రతువులు చేపట్టిన తర్వాత అన్నీ సర్దుకున్నాయని చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఎవరో దెయ్యాలను స్కూల్‌కు పంపించి ఉంటారని పేర్కొన్నారు. స్కూల్‌లో అసాధారణంగా ప్రవర్తిస్తున్న విద్యార్థినులు ఇంటి వద్ద ఆరోగ్యంగానే ఉంటున్నారని సర్పంచ్ శివకుమార్ పనికా వివరించారు.

Also Read: ముంబయిలోని హాస్పిటల్‌లో 132 ఏళ్ల కిందటి సొరంగం వెలుగులోకి.. ఎలా తెలిసిందంటే?

ఈ అమ్మాయిలకు పదిహేను రోజులుగా ఈ సమస్య ఉన్నదని, వారిని వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించామని వివరించారు. ఈ అమ్మాయిలను ట్రీట్ చేసిన  డాక్టర్ భూపేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఇలా గత 15 రోజులుగా జరుగుతున్నదని తెలిపారు. అయితే, రోజూ ఇలా వేర్వేరుగా బాలికలు దీని బారిన పడుతున్నారని పేర్కొన్నారు. వారు పాక్షికంగా అపస్మారక స్థితిలోకి వెళ్లుతున్నారని, ఇతరుల వెంట్రుకలు లాగుతున్నారని చెప్పారు. డిసెంబర్ 14వ తేదీన ఇది తన కళ్ల ముందే జరిగిందని అన్నారు. ఇది సైకలాజికల్ ఇష్యూగా ఉన్నదని, వారికి పాథలాజికల్ టెస్టు చేస్తే నార్మల్‌గా వచ్చిందని వివరించారు. శుక్రవారం, శనివారాల్లో తాను వారి ఇళ్లకు వెళ్లినట్టు చెప్పారు. అక్కడ వారంతా నార్మల్‌గా ఉంటున్నారని పేర్కొన్నారు.

సైకియాట్రిస్ట్ డాక్టర్ సత్యకాంత్ త్రివేది మాట్లాడుతూ, ఇది సైకలాజికల్ సమస్య అని, కొన్ని విషయాలు బయటకు చెప్పకుండా మైండ్‌లో మాత్రమే ఉంచుకునే స్థితి ఉంటుందని, ఇది వారికి ఒక రకమైన ఒత్తిడిని కలిగిస్తున్నదని ఆయన వివరించారు. ఈ ఒత్తిడి వారి సామర్థ్యాన్ని దాటినప్పుడు అది ఫిజికల్ సింప్టమ్‌గా మారుతున్నదని తెలిపారు. దీన్ని కన్వర్షన్ డిజార్డర్ అని, హిస్టీరియా లేదా డిసోసియేటెడ్ డిజార్డర్ అని పిలుస్తారని వివరించారు. 

Also Read: మెంటల్ స్ట్రెస్, భక్తి గీతాలు, మావో జెడాంగ్.. జయలలిత చివరి రోజులు ఎలా గడిచాయ్?

ఇది కౌమర దశలోని బాలికల్లోనే ఎందుకు ఎక్కువ కనిపిస్తున్నదనే ప్రశ్న కూడా ఉన్నదని, దీనికి ప్రధాన కారణం మన సమాజంలో వారికి వ్యక్తీకరించే స్వేచ్ఛ చాలా పరిమితంగా ఉంటుందని ఆయన వివరించారు. అలాగే, ఆ వయసులో వారు అనేక మార్పులకు లోనవుతారని తెలిపారు. మన సమాజంలో కౌమార దశలోని పిల్లలు ఎక్కువ మాట్లాడటం సాధ్యం కాదని, ముఖ్యంగా బాలికలకు మాట్లాడే లేదా వ్యక్తీకరించే అవకాశాలు చాలా స్వల్పం అని చెప్పారు. వారికి కౌన్సెలింగ్ చాలా అవసరం అని, ముఖ్యంగా వారు చెప్పే విషయాలను ఆలకించడం మరీ ముఖ్యమని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios