నా పాత నెంబర్ ఇంకా పని చేస్తోంది.. కోవిడ్ సాయం కోసం కాల్ చేయొచ్చు - సోనూ సూద్
కోవిడ్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నటుడు సోనూసూద్ అన్నారు. తన పాత నెంబర్ ఇంకా యాక్టివ్ గానే ఉందని, సాయం కోసం తనను, తన టీమ్ ను సంప్రదించవచ్చని తెలిపారు.

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో మన దేశంలో కూడా కోవిడ్ వ్యాప్తిపై ఆందోళన ఎక్కువైంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ మళ్లీ ఓ ప్రకటనతో వార్తల్లో నిలిచాడు. తన పాత నెంబర్ పని చేస్తూనే ఉందని, కోవిడ్ సాయం కోసం తనను సంప్రదించవచ్చని ఆయన అన్నారు. సాయం అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం: 16 మంది ఆర్మీ జవాన్లు మృతి
తన భార్య సోనాలి సూద్‌తో కలిసి ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించించేందుకు సోనూసూద్ శుక్రవారం రాజస్థాన్ లోని ఇండోర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే ఈ సమయంలో ఆయనను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా ాయన మాట్లాడుతూ.. ఇండోర్ నగరాన్ని ప్రశంసించారు. ఇండోర్ కు రావడం చాలా ఆనందంగా ఉందని, దీనిని అందమైన సిటీగా మర్చారని అన్నారు. తన ఇళ్లు ఇండోర్ అని తెలిపారు. ఈ నగరానికి మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ అవార్డు వస్తోందని తెలిపారు.
కాగా.. కొత్త కరోనా వేరియంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. తన పాత ఫోన్ నెంబర్ ఇంకా యాక్టివ్ గా ఉందని అన్నారు. ప్రజలకు ఎలాంటి సాయం కావాలన్నా.. తనను లేకపోతే తన టీమ్ ను సంప్రదించాలని సూచించాడు. “నంబర్ అబ్ భీ వహీ హై, జరూరత్ పడేగీ టు ఫోన్ జరుర్ కిజియేగా (నా నంబర్ ఇప్పటికీ అలాగే ఉంది. దయచేసి అవసరమైనప్పుడు కాల్ చేయండి)” అని తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..లోయలో పడిపోయిన కారు.. నలుగురు మృతి
దేశవ్యాప్తంగా ఉన్న తన బృందాలకు ఇప్పటికే కోవిడ్ ఎమర్జెన్సీపై అలెర్ట్ చేసినట్టు తెలిపారు. కాగా.. గడిచిన రెండు కరోనా వేవ్ లో నటుడు సోనూ సూద్ దేశ వ్యాప్తంగా ఎంతో సాయం చేశారు. రియల్ హీరోగా నిలిచారు. స్వయంగా ఆయనే రంగంలోకి దిగి అవసరమైన వారికి ఆపన్నహస్తం అందించారు. లాక్ డౌన్ లో తమ ఇబ్బందులు పడుతున్న వలసవాదులకు ఇంటికి వెళ్లేందుకు సాయం చేశారు. అలాగే ఆక్సిజన్ ను అందించారు. రోగులకు పడకలను ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా టీమ్ లను ఏర్పాటు చేసి కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలబడ్డారు.
ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి.. పోలీసు మృతి, పౌరులకు గాయాలు
సోనూసూద్ తన తండ్రి శక్తి సాగర్ సూద్ పేరు మీద ముంబైలో ‘శక్తి’ అనే అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. దీని ద్వారా ముంబైలో ప్రతిరోజూ దాదాపు 45,000 మందికి ఆహారం అందిస్తున్నారు. కాగా.. గతేడాది నుంచి తగ్గుముఖం పట్టిన కరోనా మళ్లీ విజృంభిస్తోంది. మన దేశానికి ఆనుకొని ఉన్న చైనాలో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజల్లో ఒక్క సారిగా కరోనా భయం పట్టుకుంది. అయితే భయపడాల్సిన అవసరం లేదని, కరోనా సోకకుండా ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించడం, శానిటైజర్లు వాడటం, భౌతికదూరం పాటించడం వంటి చర్యలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది.