Asianet News TeluguAsianet News Telugu

ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి.. పోలీసు మృతి, పౌరులకు గాయాలు

పాకిస్థాన్ లో మళ్లీ ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దేశ ముఖ్య పట్టణమైన ఇస్లామాబాద్ లో శుక్రవారం ఉదయం ఈ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటలో ఓ పోలీసు చనిపోయారు. సాధారణ పౌరులకు గాయాలయ్యాయి. 
 

Suicide attack in Islamabad.. Police killed, civilians injured
Author
First Published Dec 23, 2022, 1:32 PM IST

పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ సిటీలో ఉన్న హైలెవెల్ మార్కెట్, యూనివర్సిటీ, గవర్నమెంట్ ఆఫీసులు ఉన్న ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో అనేక మంది పౌరులకు గాయాలు అయ్యాయి. ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఈ సమాచారం అందిన వెంటనే యాంటీ టెర్రరిస్ట్ ఫోర్స్ అక్కడికి చేరుకుంది.

జియో న్యూస్ ప్రకారం.. ఇస్లామాబాద్ ఐ-10 ప్రాంతంలో ఓ కారు అనుమానస్పదంగా తిరుగుతోంది. అయితే ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అదీల్ హుస్సేన్ ఆ కారును ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ కారులో ఒక్క సారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అదీల్ హుస్సేన్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఇస్లామాబాద్ హాస్పిటల్ కు తరలించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. 

ఘటనా స్థలానికి డీఐజీ సోహైల్ జాఫర్ చత్తా చేరుకున్నారు. మీడియాతో మాట్లాడారు. పేలుడు జరిగినప్పుడు కారులో ఓ మహిళ, ఓ పురుషుడు ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. పోలీసుల చర్య వల్ల ఇస్లామాబాద్ లో ఓ పెద్ద ఘటన జరగకుండా ఆగిపోయిందని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. కాగా భద్రతా అధికారులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios