నేను చెప్పిందే నిజమైంది.. ఆ పార్టీ బీజేపీకి బీ టీమ్ అని తేలింది: సీఎం వ్యాఖ్యలు
నేను చెప్పిందే నిజమైంది. బీజేపీకి బీ టీమ్ జేడీఎస్ అని తేలిందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఆ పార్టీ సెక్యులర్ పార్టీ అని చెబుతారని, కానీ, కమ్యూనల్ పార్టీతో చేతులు కలిపిందని పేర్కొన్నారు.

బెంగళూరు: కర్ణాటక రాజకీయాలపై సీఎం సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్ పై తాను చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయని అన్నారు. జేడీఎస్ ఇప్పుడు బీజేపీకి బీటీమ్ అని తేలిపోయింది కదా.. అంటూ పేర్కొన్నారు. సెక్యులర్ అని చెప్పుకునే ఆ పార్టీ విలువలను ఎక్కడ పాతరేసిందని ప్రశ్నించారు. లౌకిక పార్టీ అని చెప్పుకునే జేడీఎస్ ఇప్పుడు మతతత్వ పార్టీ బీజేపీతో చేతులు కలిపిందని వివరించారు.
హుబ్బలిలో మీడియాలో సమావేశాలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. జేడీఎస్‌ను బీజేపీకి బీ టీమ్ అని తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిరూపితమయ్యాయని వివరించారు. దానికది సెక్యూలర్ పార్టీ అని జేడీ(సెక్యూలర్) అని చెప్పుకుంటుందని, కానీ, కమ్యూనల్ పార్టీతో చేతులు కలిపిందని వివరించారు.
‘తమ పార్టీ జేడీఎస్‌కు ఏ పార్టీతోనూ ఎలాంటి అవగాహన లేదనిదేవెగౌడ తరుచూ అంటూ ఉంటారు. కానీ, ఇప్పుడు జేడీఎస్ సమన్వయ కమిటీ చీఫ్ జీ టీ దేవెగౌడ్ ఏమన్నారు? వారి పార్టీ మనుగడ కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టు చెప్పారు. ఇదేం రుజువు చేస్తుందంటే.. అసలు ఆ పార్టీకి భావజాలమే లేదు. అధికారం కోసం వాళ్లు ఏమైనా చేస్తారు.’ అని సిద్ధరామయ్య అన్నారు.
Also Read: రేపు అక్షరధామ్ ఆలయానికి యూకే పీఎం రిషి సునాక్.. ఆయన ఏమన్నారంటే?
లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీతో జేడీఎస్ అవగాహన చేసుకుంది. రాష్ట్రంలోని 28 స్థానాల్లో నాలుగు స్థానాల్లో జేడీఎస్ పోటీ చేయడానికి ఒప్పందం పెట్టుకుంది. మిగిలిన అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే.. ఆ పార్టీకి జేడీఎస్ మద్దతు తెలుపుతుంది.