ఏక్ నాథ్ షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వం శాసన సభలో సోమవారం తన మెజారిటీని నిరూపించుకుంది. అనంతరం షిండే భావోద్వేగ ప్రసంగం చేశారు. తన జీవితంలో జరిగిన పరిణామాలు, రాజకీయ ప్రయాణం, తిరుగుబాటు విషయాలను సభలో ప్రస్తావించారు. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సోమవారం అసెంబ్లీలో సీఎంగా తన తొలి ప్రసంగం చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. త‌న కుటుంబ స‌భ్యుల‌కు జ‌రిగిన ఓ ప్ర‌మ‌దాన్ని గుర్తు చేసుకుని ప‌ర్యంత‌మ‌య్యారు. ఉద్ద‌వ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన‌ప్పుడు త‌న కుటుంబ స‌భ్యుల‌కు వ‌చ్చిన బెదిరింపులు వ‌చ్చాయ‌ని ఆరోపించిన షిండే, త‌న బిడ్ద‌లు చ‌నిపోయిన‌ప్పుడు, క‌ష్టకాలంలో ఓదార్చిన శివ‌సేన నేత ఆనంద్ డిఘే చేసిన ఓదార్పును స‌భ‌లో ఆయ‌న పంచుకున్నారు. 

క్రికెట్ బెట్టింగులు, అనుమానం.. భార్యను బండరాయితో కొట్టి చంపిన భర్త...

‘‘ నా ఇద్దరు పిల్లలు నా కళ్లముందే చనిపోయారు. ఆ సమయంలో ఆనంద్ డిఘే నాకు మద్దతు ఇచ్చారు నా కుటుంబం నాశనమైంది, నేను ఎందుకు జీవించాలి? ఎవరి కోసం బ‌త‌కాలి ? ఇక నేను పార్టీలో ప‌ని చేయ‌లేన‌ని చెప్పాను. నేను భార్య, నా త‌ల్లిదండ్రుల కోసం బ‌త‌కాల‌ని నిర్ణ‌యించుకున్నాను. నా కుటుంబానికి నా అవ‌స‌రం ఉంద‌ని గ్ర‌హించాను. నేను ఇక పార్టీ కోసం ప‌ని చేయ‌లేన‌ని ఆనంద్ డిఘేకు చెప్పాను. కానీ ఆయ‌న న‌న్ను ఓదార్చారు. నేను నా కుటుంబ కోస‌మే కాకుండా స‌మాజం కోసం కూడా ప‌ని చేయాల‌ని నాకు చెప్పారు.’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

సభలో ఇంకా షిండే మాట్లాడుతూ ‘‘ మా నాన్న బతికే ఉన్నారు. మా అమ్మ చనిపోయారు. నేను మా తల్లిదండ్రులకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోయాను. నేను వచ్చే సరికే వారు నిద్రపోతారు. నేను పడుకున్నప్పుడు పనికి వెళ్లేవారు. నా కొడుకు శ్రీకాంత్, నా ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఆ సమయంలో ఆనంద్ డిఘే నన్ను ఓదార్చారు. నేను కోలుకోవడానికి సహాయం చేసారు. నన్ను అసెంబ్లీలో శివసేన నాయకుడిని చేశారు.’’ అని ఆయన గుర్తు చేసుకున్నారు. కాగా.. షిండే ఇద్దరు పిల్లలు తన గ్రామాన్ని సందర్శించినప్పుడు నదిలో పడవ బోల్తా ప‌డింది. దీంతో వారు మ‌ర‌ణించారు. 

Scroll to load tweet…

మహా వికాస్ అఘాడీ ప్ర‌భుత్వంలో తాను ముఖ్య‌మంత్రి కావాల్సి ఉంద‌ని అన్నారు. అయితే ఎన్సీపీ అజిత్ ప‌వార్ దానిని వ్య‌తిరేకించార‌ని చెప్పారు. కానీ ఓ సందర్భంలో అజిత్ ప‌వ‌ర్ త‌న‌ను క‌లిశార‌ని తెలిపారు. ‘‘మీరు సీఎం కావ‌డంపై మాకు ఎలాంటి అభ్యంత‌రం లేదు. కానీ మీ పార్టీయే అభ్యంత‌రం తెలిపింది ’’ అని ఆయన అన్నారు.’’ కానీ నేను సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేకు మ‌న‌స్పూర్తిగా మ‌ద్ద‌తు ఇచ్చానని ఆయ‌న అన్నారు. ప్ర‌తిప‌క్ష బెంచ్ ల‌ను చూస్తూ ‘‘ ఎవ‌రూ వ్యక్తిగతంగా తీసుకోవద్దు. కానీ చాలా మంది ఎమ్మెల్యేలు తమ గుర్తింపు విష‌యంలో ఆందోళన చెందారు. బీజేపీ మా సహజ మిత్రపక్షం ’’ అని ఆయన నొక్కి చెప్పారు. 

సిద్ధూ మూసేవాలా హత్య కేసులో షార్ప్ షూటర్ అంకిత్ శిర్సా అరెస్ట్..

ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ఉండ‌టం వ‌ల్ల శివ‌సేన లాభ‌ప‌డాల్సి ఉంద‌ని, అయితే అలా జ‌ర‌గలేద‌ని అన్నారు. తన తిరుగుబాటు విష‌యంలో మాట్లాడుతూ.. ఎవరూ కనిపెట్టలేనప్పుడు, అందరూ నిద్రపోయిన తర్వాత, మేల్కొనే ముందు రహస్య సమావేశాలు నిర్వహించినట్టు చెప్పారు. “ మేము బంగారు చెంచాలతో పుట్టలేదు. సాధారణ మనిషి కూడా ముఖ్యమంత్రి కాగలడు. ఇది చాయ్‌వాలాల‌, రిక్షా వాలాలు, కూరగాయలు అమ్మేవారి, రైతుల ప్రభుత్వం. ప్ర‌ధాని నరేంద్ర మోడీ కూడా చాయ్ అమ్మారు.’’ అని అన్నారు. తన తిరుగుబాటును సమర్థిస్తూ.. ద్రోహం తన రక్తంలో లేదని అన్నారు. అయితే ఎన్నికల ఫలితాల కారణంగా తాను అవమానానికి గురయ్యానని, దానిని తాను భరించలేకపోయానని అన్నారు.