అనుమానం పెను భూతమయ్యింది. దీనికి ఆర్థిక ఇబ్బందులు తోడయ్యాయి. బెట్టింగుల వ్యసనం వదలలేదు. ఇంకేముంది అన్నింటి మీదా విసుగు, చిరాకు కలిపి భార్య మీద చూపించాడు. బండరాయితో మోది హత్య చేశాడు.
బెంగళూరు : ఓ భర్తకు డబ్బు జబ్బు పట్టుకుంది. అదీ.. అప్పనంగా వచ్చే సొమ్ము మీద మోజు పెరిగింది. దీనికి తోడు cricket betting వ్యసనాలూ అలవాటయ్యాయి. అంతే… దీని కోసం పుట్టింటి నుంచి money తేవాలని భార్యను వేధించడం మొదలుపెట్టాడు. దీనికి తోడు అనుమానం జబ్బు పట్టుకుంది. అంతే భార్యను అతి కిరాతకంగా murder చేశాడు. బెంగళూరులోని హాసన్ తాలూకా దొడ్డమండిగహళ్లికి చెందిన మంజునాథ్ బెంగుళూరులో ఒక ఆటోమొబైల్ సంస్థలో పని చేస్తున్నాడు.
ఇతనికి నెలకి రూ. 80 వేల జీతం వస్తుంది. కానీ క్రికెట్ బెట్టింగ్ లకు బానిసయ్యాడు. వాటిల్లో భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో పుట్టింటికి వెళ్లి డబ్బులు తేవాలని భార్య తేజస్వినిని తరచూ వేధించేవాడు. ఈ వేధింపుల గొడవ పెద్ద మనుషుల దాకా వెళ్ళింది. వాళ్లు పలుమార్లు రాజీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆర్థిక ఇబ్బందులతో బెంగుళూరులో జీవించలేని మంజునాథ్ సంసారాన్ని హాసన్ కు మార్చాడు.
హాసన్ కు వచ్చిన తరువాత తేజస్విని కూడా చిన్న ఉద్యోగంలో చేరింది. అయితే ఈ క్రమంలో మంజునాథ్ ఆమెను తరచూ అనుమానిస్తుండేవాడు. వేధించేవాడు. అలా సోమవారం ఆమెతో గొడవపడి బండరాయితో కొట్టి చంపాడు. పోలీసులు మంజునాథ్ తో పాటు అతని తల్లిదండ్రులు సరోజమ్మ, బసవేగౌడలను కూడా అరెస్టు చేశారు.
సిద్ధూ మూసేవాలా హత్య కేసులో షార్ప్ షూటర్ అంకిత్ శిర్సా అరెస్ట్..
ఇదిలా ఉండగా, వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపూర్ లో దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న ఓ మహిళను కిరాతకంగా హత్య చేశాడు. స్థానిక ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్ గ్రామానికి చెందిన పున్నం వెంకన్నకు.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన మంజుల (45)ను పదిహేనేళ్ళ కిందట కలుసుకున్నాడు.
వీరికి హైదరాబాదు లింగంపల్లిలోని ఓ వృద్ధాశ్రమంలో పరిచయం అయ్యింది. అక్కడే ఒకరి మీద ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఆ తరువాత ఇద్దరూ సహజీవనం చేయడం మొదలుపెట్టారు. వృద్ధాశ్రమంలోనే పని చేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. ఈ ఆదివారం ఉదయం వీరిద్దరు స్వగ్రామానికి వచ్చారు. ఆదివారం వీరిద్దరూ గొడవ పడడం మొదలుపెట్టారు. స్థానికులు సర్ధిచెప్పారు.
అదే రోజు రాత్రి మరోసారి గొడవ పడ్డారు. ఈ సమయంలో వెంకన్న మద్యం మత్తులో కత్తిపీటను గ్యాస్ స్టవ్ మీద వేడిచేసి.. మంజుల చేతులపై కాల్చాడు. అంతటితో ఆగకుండా కత్తితో విచక్షణారహితంగా ఆమె మీద దాడి చేశాడు. అలా చిత్రహింసలు పెట్టి హత్య చివరికి చేశాడు. ఆ తర్వాత సోమవారం తెల్లవారుజామున ఆమెను చంపేశాను అంటూ అరుస్తూ.. వీధుల్లో తిరిగాడు. దీంతో స్థానికులకు విషయం తెలిసింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.
మృతురాలు మంజులకు 22 ఏళ్ల కిందట వివాహం అయ్యి, భర్తతో విడాకులు తీసుకుంది. ఒక కొడుకున్నాడు. వెంకన్న మొదటి భార్యను హత్య చేసి జైలుకు వెళ్లివచ్చాడు. ఆ తర్వాత మరో మహిళతో ఉండేవాడు. ఆమె కూడా అతడి ఆకృత్యాలు తట్టుకోలేక వెళ్ళిపోయింది.
